నవమాసాలు మోసి పెంచిన తల్లికి యమపాశంగా మారుతున్న కన్న పేగు.బుడి బుడి అడుగులు వేస్తుంటే.
చూసి సంతోషించిన ఆ తల్లికి కొడుకే కాలయముడు.గోరుముద్దలు పెట్టి చందమామ కతలు చెప్పి తినిపించిన ఆ తల్లికి కొడుకే భూమి మీద నూకలు లేకుండా చేస్తున్నాడు.
తాగి ఊగి ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నామో మర్చిపోయి జంతువులకంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.తల్లిని కూడా చూడకుండా కాటికి పంపిస్తున్నారు.
అలాంటి ఒక యదార్త గాదే ఈ రోజు మన సోర్టీ…
తాగడం తాగింది దిగేవరకు తూలడం అలవాటు శక్తివేల్ కు.భార్య పిల్లలను విడిచి తల్లి వద్దే ఉంటాడు.అయినా తల్లికి దిన దిన గండమే.కొడుకు కన్న పేగు అని భయంతోనే భరించింది.కానీ ఆ భయమే ఏదో ఒక రోజు నిజం అవుతుంది అని ఆ తల్లి గ్రహించలేకపోయింది.దాని పర్యవసానమే సజీవంగా సమాధి అయింది ఆ తల్లి.
అవును మీరు విన్నది నిజమే.సజీవంగా తల్లి బతికి ఉండగానే పూడ్చి పెట్టాడు ఆ నవమాసాలు తల్లి కడుపులో ఉండి వచ్చిన కొడుకు.
ఆ తల్లిని తాగిన మత్తులో భూమి మీద లేకుండా చేశాడు.మద్యం మత్తులో కన్నతల్లిపై దాడి చేసి, ఆమెను సజీవంగా పూడ్చేసిన ఓ కుమారుడి ఉదంతం తమిళనాడులోని విల్లుపురం జిల్లా ముగైయూర్ సమీపంలోని సిత్తామూర్‌లో వెలుగు చూసింది.
సిత్తామూర్‌కు చెందిన శక్తివేల్ దంపతులకు నలుగురు కుమార్తెలు, కుమారుడున్నారు.గొడవల కారణంగా అతని భార్య పిల్లలతో సహా పుట్టింట్లో ఉంటోంది.
ప్రస్తుతం అతను తల్లి యశోదతో కలిసి నివసిస్తున్నాడు.తండ్రి 15 ఏళ్ల క్రితమే చనిపోయాడు.
నిత్యం మద్యం తాగే అలవాటున్న శక్తివేల్… తల్లితో తరచూ గొడవ పడేవాడు.భయంతో ఆమె రాత్రివేళల్లో ఎదురింట్లో నిద్రించేవారు.
మంగళవారం రాత్రి మద్యం మత్తులో వచ్చిన శక్తివేల్ తల్లితో మరోసారి గొడవ పడ్డాడు.తర్వాత యశోద కనిపించలేదు.
ఇరుగుపొరుగు వారు ఆమె కోసం గాలించారు.
శక్తివేల్ ఇంటికి తాళం వేసి ఉండడంతో వెనక వైపు వెళ్లి పరిశీలించగా యశోద చీర కిందపడి ఉండడాన్ని గమనించారు.అనుమానంతో తాళం పగలగొట్టి లోపలికి వెళ్లారు.లోపలే ఉన్న శక్తివేల్ వారిని చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు.
అతనికి స్థానికులు దేహశుద్ధి చేయగా… తన తల్లిపై దాడి చేయడంతో ఆమె తలకు గాయమై, స్పృహ తప్పి పడిపోయిందని తెలిపాడు.వెంటనే ఇంటి వెనుక గొయ్యి తీసి పూడ్చి పెట్టినట్లు వెల్లడించాడు.
పోలీసులు వచ్చి గొయ్యిని తెరిచేలోగానే ఆమె ప్రాణాలు విడిచింది.
పున్నామ నరకం నుంచి తప్పించే వాడు కొడుకు అనే వింటుంటాం.కానీ బతకడానికి రోజులు మిగిలి ఉన్నా కూడా వాటిని తక్కువ చేసి బతికుండగానే భూమి మీద నూకలు లేకుండా చేసే ఇలాంటి వారి వల్ల ప్రయోజనం ఏంటి? ఆడపిల్ల పుడితే చీదరించుకుంటారు.ఆడపిల్లను కనాలి అంటే భయపడుతారు.
కానీ ఈ రోజుల్లో ఇలాంటి వారి మగమృగాలను కనాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి తల్లిదండ్రులది.మారుతున్న పోకడలకు ఎలా ఉంటారో అని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న తల్లిదండ్రులెందరో.
ఆస్తుల కోసం గొడవ, అన్నం కోసం గొడవ, కూర బాగాలేదని గొడవ, అడిగిన బైక్ కొనివ్వలేదని గొడవ.చిన్న చిన్న అవసరాలకు గొడ్డలికి పని చెప్పే కొడుకులు ఉన్న రోజుల్లో తల్లిదండ్రికి జాగ్రత్త అవసరం.
కన్న పేగే అనుకుంటే కాలయముడుగా మారే ప్రమాదం ఉంది.కనుకు జాగ్రత్త వహించడం అప్రమత్తంగా ఉండటం ఉత్తమం.