30 ఏళ్లుగా మగాడి వేషంలో స్త్రీ.. ఎందుకో తెలుసా?

ఈ ప్రపంచంలో బంధువులు, స్నేహితుల ప్రేమకంటే తల్లి ప్రేమ చాలా గొప్పది.అమ్మప్రేమకు సాటి ఏది రాదు కూడా.

అయితే తాజాగా తన కూతురి కోసం ఏకంగా 30 ఏళ్ల పాటు మగాడిలా బతికింది ఓ తల్లి.పురుషుడి వేషధారణలో పెయింటింగ్, టీ మాస్టార్, వంట మనిషిగా ఇలా​ ఎన్నో పనులను చేసింది.

ఇన్నేళ్లకు ఈ నిజాన్ని బయటపెట్టింది.వివరాల్లోకి వెళ్తే.

తమిళనాడుకు చెందిన పెచ్చియామ్మాల్​ కి 30 ఏళ్ల క్రితం వివాహమైంది.అప్పుడు ఆమె వయస్సు 20 ఏళ్లు.

Advertisement

పెళ్లయిన 15 రోజులకే భర్త చనిపోయాడు. ఒంటరి మహిళ కావడం వల్ల ఎన్నో తప్పుడు చూపులు ఆమె వెంటపడేవి.

వేధించేవి.అంతలోనే కూతురికి జన్మనిచ్చింది.

అయితే కూతురిని సంరక్షించడం సహా తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఆమె ఓ అసాధారణ మార్గాన్ని ఎంచుకుంది.మగాడిలా వేషధారణ మార్చుకుంది.

ఒక్కటి కాదు.రెండు కాదు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

ఏకంగా 30 ఏళ్ల పాటు అనేక సవాళ్లను ఎదుర్కొని టామ్​ బాయ్​లా బతికింది.ఆమే.తమిళనాడుకు చెందిన పెచ్చియామ్మాల్​.పేదరికం వల్ల పనికోసం చాలా ప్రాంతాలకు మారాల్సి వచ్చేది.

Advertisement

ఎక్కడికెళ్లినా తాను మగాడిలా పరిచయం చేసుకునేది.ఈ క్రమంలోనే స్థానికంగా "అన్నాచ్చి" (పెద్దన్న)గా గుర్తింపు పొందింది.కొన్నాళ్లకు తూతుక్కుడి తిరిగొచ్చి.

క్రాప్​ హెయిర్​ కట్​, మగాడి దుస్తుల్లో పురుషుడిలానే జీవించసాగింది. టీ, పరోటా షాపుల్లో పనిచేసి.

ముత్తు మాస్టర్​గా పేరుగాంచింది.పెచ్చియామ్మాల్ కూతురు మాట్లాడుతూ.

"పనికి వెళ్లి వచ్చే క్రమంలో ఎదురైన వేధింపులతో అమ్మ మగాడిగా వేషధారణ మార్చింది.అమ్మ ఇలా చేసినందుకు గర్వంగా ఉంది.

అయితే ధ్రువీకరణ పత్రాల్లో పురుషుడిలా ఉండటం వల్ల పింఛను తీసుకోవడంలో అమ్మ ఇబ్బందులు ఎదుర్కుంటోంది.అది పరిష్కారమై అమ్మకు పింఛను అందితే ఆమెకు ఎంతో సాయంగా ఉంటుంది" అని తెలిపింది.

తాజా వార్తలు