కరోనాలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు తమిళనాడు ప్రభుత్వం భారీ సాయం..!!

మహమ్మారి కరోనా( Corona ) ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే.ఈ వైరస్ కారణంగా చాలామంది మరణించారు.

మొదటి వేవ్ లో యూరప్ దేశాలలో మరణాల సంఖ్య పెరిగింది.అప్పటికి వ్యాక్సిన్ రాకపోవడంతో.

పాటు సరైన వైద్య సదుపాయం లేకపోవడంతో.చాలామంది మరణించారు.2019 నవంబర్ నెలలో చైనా( China )లో బయటపడ్డ ఈ వైరస్ అతి తక్కువ కాలంలోనే ప్రపంచం మొత్తం విస్తరించింది.భారతదేశంలో మొదటి వేవ్ ప్రభావం అంతగా లేకపోయినా తర్వాత రెండో వేవ్ లో వైరస్ విజృంభించింది.

రోజుకి లక్షల సంఖ్యల్లో పాజిటివ్ కేసులు వచ్చేవి.అదేవిధంగా వేల సంఖ్యలో మరణించేవారు.

Advertisement

సెకండ్ వేవ్ లో వైరస్ అరికట్టడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నవి.లాక్ డౌన్ పెట్టిన గాని వైరస్ విస్తృతంగా వ్యాపించేది.ఈ కరోనా కారణంగా ఇండియాలో చాలామంది తమ తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు ఉన్నారు.

ఈ క్రమంలో కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాధలైన పిల్లలకు తమిళనాడు ప్రభుత్వం (Tamil Nadu Government )430 కోట్ల రూపాయల కేటాయించింది.తల్లిదండ్రులను ఇద్దరినీ కోల్పోయిన 382 మంది చిన్నారుల ఖాతాలో ఐదు లక్షలు జమ చేయడం జరిగింది.తల్లి లేదా తండ్రి కోల్పోయిన 13,682 మంది పిల్లల పేరున 3 లక్షల రూపాయలు డిపాజిట్ చేయనుంది.18 ఏళ్లు వచ్చాక ఈ డబ్బులు ఉపయోగించుకోవచ్చు అని తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది.అంతేకాకుండా బాలికల సంరక్షణకు అదనంగా 239 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు