మిల్కీ బ్యూటీ తమన్నా( Tamanna ) సినీ కెరీర్ ప్రారంభించి రెండు దశాబ్ధాలు అవుతున్నా ఇప్పటికీ ఆమె సూపర్ ఫాం లో ఉంది.తనకు వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని చేస్తూ వచ్చిన తమన్నా ఇప్పటికీ సీనియర్ స్టార్ హీరోలతో జత కడుతుంది.
ప్రస్తుతం తమన్నా కూడా స్టార్ లీగ్ లో కెరీర్ కొనసాగిస్తుంది.తమన్నా లేటెస్ట్ మూవీ చిరంజీవి భోళా శంకర్( Bhola Shankar ) సినిమాలో తమన్నా నటించింది.
ఆ సినిమాలో కీర్తి సురేష్ కూడా సిస్టర్ రోల్ లో నటిస్తుంది.తమన్నా చిరుతో రొమాన్స్ చేస్తుంది.F3 తర్వాత తమన్నాకి వచ్చిన బెస్ట్ ఛాన్స్ ఇదే.అయితే చిరుతో ఆల్రెడీ సైరా నరసిం హా రెడ్డి సినిమా చేసిన తమన్నా భోళా శంకర్ తో మరోసారి జత కట్టింది.
తెలుగులో తమన్నా మళ్లీ ఫాం కొనసాగించాలి అంటే మాత్రం భోళా శంకర్ సినిమా హిట్ కొట్టాల్సి ఉంది.ఈమధ్య వెబ్ సీరీస్ లతో కూడా బాలీవుడ్ ఆడియన్స్ ని అలరిస్తున్న తమన్నా తెలుగులో ఇంకా ఆడియన్స్ ని మెప్పించాలని చూస్తుంది.చిరు భోళా శంకర్ తో పాటుగా సూపర్ స్టార్ రజినికాంత్ జైలర్ తో( Jailer ) కూడా తమన్నా వస్తుంది.ఈ రెండు సినిమాలు తమన్నా మైలేజ్ ని పెంచుతాయా లేదా అన్నది చూడాలి.