ఆ సీన్లలో నటించడానికి చాలా ఇబ్బంది పడ్డాను... తమన్నా ప్రియుడి కామెంట్స్ వైరల్!

ప్రస్తుత కాలంలో ఓటీటీల హవా పెరగడంతో ఎంతోమంది సినిమాలతో పాటు వెబ్ సీరీస్ లో కూడా నటించడానికి ఆసక్తి చూపుతున్నారు.ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు అందరూ కూడా ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్నారు.

 Tamannah Boy Friend Vijay Varma Shocking Comments About Karina Kapoor , Vijay V-TeluguStop.com

ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి కరీనాకపూర్( Karina Kapoor ) సైతం వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు.తాజాగా ఈమె నటించిన జానే జాన్ ( Jaanejaan )వెబ్ సిరీస్ ప్రసారం కావడానికి సిద్ధంగా ఉంది.

ఇక ఇందులో తమన్నా ప్రియుడు విజయ్ వర్మ ( Vijay Varma ) నటించారు.

ఇక ఈ వెబ్ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఏ మాత్రం ఖాళీ లేకుండా ప్రతి ఒక్కరూ ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన కరీనాకపూర్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి .మేము కరీనాకపూర్ సినిమాలు చూస్తూ ఎంతో ఎంజాయ్ చేసే వాళ్ళమని తెలియజేశారు.ఇలా ఆమె సినిమాలు చూస్తూ పెరిగిన మేము తనతో కలిసి నటించాలి అంటే మొదట్లో కాస్త భయం వేసిందని తెలిపారు.

ఇక ఈ వెబ్ సిరీస్లో కొన్ని రొమాంటిక్ ( Romantic ) సన్నివేశాలు ఉన్నాయి.ఆ సన్నివేశాలలో నటించడానికి ముందు నా శరీరంలో వణుకు పుట్టిందని ఆ సమయంలో చాలా ఇబ్బంది పడ్డాను అంటూ ఈ సందర్భంగా విజయ్ వర్మ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక కరీనా గురించి మాట్లాడుతూ ఆమె ఎంతో అందమైన నటి అలాగే ఎంతో మంచి మనసు కలిగినదని, తన మనసుని ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు అంటూ ఈ సందర్భంగా ఈయన తెలియజేశారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube