టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకొని నేషనల్ క్రష్ గా మారినటువంటి రష్మిక మందన్న( Rashmika Mandanna ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి రష్మిక ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా మారిపోయారు.
ఇలా వివిధ భాష చిత్రాలలో నటించడం వల్ల ఏమాత్రం తీరిక లేకుండా వరుస సినిమా షూటింగ్లకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.

ఇకపోతే ఫ్యాషన్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉన్నటువంటి రష్మిక ఏం చేసినా కూడా క్షణాల్లో వైరల్ అవుతుందనే విషయం మనకు తెలిసిందే.అయితే కొన్నిసార్లు రష్మిక వ్యవహార శైలి కారణంగా భారీ స్థాయిలో ట్రోల్స్( Trolls ) కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.ప్రస్తుతం ఈమె తన వస్త్రధారణ కారణంగా ఈ విధమైనటువంటి ట్రోల్స్ ఎదుర్కొంటున్నారని చెప్పాలి.
తాజాగా ఎయిర్ పోర్ట్ లో సందడి చేసినటువంటి రష్మిక కాస్త విచిత్రమైనటువంటి డ్రెస్సులో కనిపించారు.ఇక ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారగా నేటిజన్స్ పై వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుత కాలంలో టోన్ జీన్స్( Torn Jeans ) ధరించడం ఫ్యాషన్ అనే విషయం మనకు తెలిసింది.అయితే అక్కడక్కడ చిరిగిపోతే స్టైల్ గా ఉంటుంది కానీ ప్యాంటు కొన్నిచోట్ల మాత్రమే అతికి ఉండి మిగిలినది మొత్తం చినిగిపోతే ఎలాగైతే ఉంటుందో రష్మిక డ్రెస్ కూడా అలాగే ఉంది.ఈ ప్యాంట్ మరింత ఎక్కువగా చినిగిపోవడంతో నేటిజన్స్ ఈ డ్రెస్ పై వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.ఏంటి రష్మిక ఏమైనా కుక్కలు( Dogs ) వెంట పడ్డాయా డ్రెస్ మొత్తం అలా చినిగిపోయింది అంటూ కొందరు ఈమె డ్రెస్ పై కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.