ఎట్టకేలకు పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన తమన్నా... వరుడు ఎవరంటే?

టాలీవుడ్ టాప్ హీరోయిన్ల జాబితాలో తమన్నా కూడా ఉంటుంది.

శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీ డేస్ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన తమన్నా తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఆ సినిమా మంచి సక్సెస్ అవడంతో అప్పటినుంచి తమన్నా తెలుగు, తమిళ,కన్నడ భాషలలో నటిస్తూ తన కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు.గత దశాబ్దకాలంగా తమన్నా హీరోయిన్ గా రాణిస్తూనే ఉంది.

ఈ మధ్యకాలంలో తమన్నాకు హీరోయిన్ గా ఛాన్సులు తగ్గినా కూడా వెబ్ సిరీస్లతో డిజిటల్ స్పీడ్ మీద తన సత్తా చాటుతోంది.ప్రస్తుతం మిల్కీబ్యూటీ తమన్నా పెళ్లి గురించిన వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

హీరోయిన్ గా అవకాశాలు తగ్గటంతో తమన్నా పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.ఈ విషయం గురించి తమన్నా స్పందిస్తూ ఇప్పట్లోనే తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని, మరొక రెండు సంవత్సరాలు పెళ్లి ప్రస్తావన తన వద్ద తీసుకురావద్దని తన తల్లిదండ్రులకు చెప్పినట్లు సమాచారం.

Advertisement

రెండు వేల 25 వ సంవత్సరంలో తమన్నా పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

హీరోయిన్ గా ఛాన్స్ లు తగ్గినప్పటికీ తమన్నా ఎప్పుడు ప్రేక్షకులకు టచ్ లో ఉంటుంది.ఇటీవల వరుణ్ తేజ్ హీరోగా నటించిన గణేష్ సినిమాలో కూడా ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది.ఇలాగే అంతకు ముందు మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ తో అలరించింది.

హీరోయిన్ గా ఛాన్స్ తగ్గినప్పటికీ ఇలా స్పెషల్ సాంగ్స్, సినిమాలలో ఇంపార్టెంట్ రోల్స్ చేస్తూ ఎప్పుడు బిజీ గా ఉంటుంది.హీరోయిన్ గా ఆఫర్లు తగ్గినప్పటికీ తమన్నా క్రేజ్ మాత్రం తగ్గలేదు.

ఇప్పటికీ తమన్నా పారితోషకం కోట్ల రూపాయలు లోనే ఉంది.

ఒకరోజు ముందుగానే పుష్ప2 విడుదల.. సంతోషంలో ఫ్యాన్స్!
Advertisement

తాజా వార్తలు