ఆఫ్ఘనిస్థాన్ లో ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు సిద్దమవుతున్నారు.శుక్రవారం తాలిబాన్ల ప్రభుత్వం కొలువుదిరిందని సమాచారం.
మధ్యాహ్నం ప్రార్థనల అనంతరం సంబంధిత ప్రకటన చేసే అవకాశం ఉంది.అయితే తాలిబన్లు క్యాబినెట్ ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తిగా ఉన్నారు.
ఆఫ్గాన్ లో ఏర్పాటుకానున్న తాలిబాన్ల ప్రభుత్వానికి తాలిబాన్ అగ్రనేత హీబాతుల్లా అఖుంద్ జాదా నాయకత్వం వహించనున్నారు. అఖుంద్ జాదా దేశ ప్రధాని లేదా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన తాలిబన్లు పాలనకు సంబంధించిన ఎటువంటి నియమాలు రూపొందించబోతున్నారు.అనే దానిపై చర్చ జరుగుతోంది.
అధ్యక్ష భవనంలో వేడుకకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తాలిబాన్ అధికారి అహ్మదుల్లా సోషల్ మీడియాలో వెల్లడించారు.మరోపక్క కాబుల్ విమానాశ్రయంలో కార్యకలాపాలు పునఃప్రారంభించడానికి తాలిబనతో కలిసి పని చేస్తున్నట్లు ఖతార్ వెల్లడించింది.స్త్రీలకు విద్య ఉద్యోగం అవకాశాలు కల్పిస్తామని చెబుతూనే వారిని ప్రభుత్వం ప్రైవేటు కార్యాలయాలు నుంచి ఇళ్లకు పంపించడం జరుగుతూనే ఉంది.2001లో తాలిబన్లు పాలన ముగిశాక 2002 నుంచి ఇప్పటివరకు మిలియన్ల సంఖ్యలో మహిళలు చదువు బాట పట్టి సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు రాజకీయాల్లో కూడా మహిళలు రాణించారు.

ప్రస్తుతం పరిస్థితి అంధకారంలోకి వెళ్ళినట్లు అయింది.అంతర్జాతీయ సమాజం స్త్రీ హక్కుల పై తీవ్ర ఆందోళన చేపట్టింది.గత ప్రభుత్వానికి సహకరించిన జర్నలిస్టు.సామాజిక కార్యకర్తలు.సైనికుల కోసం ఇంటింటికి తిరిగి వాకబుచేస్తున్నారు.ప్రభుత్వం ఏర్పాటు అనంతరం ప్రపంచ దేశాలు తమ గుర్తించాలని తహతహలాడుతున్నారు.
ఇరాన్, రష్యా, పాకిస్తాన్, చైనా దేశాలు మాత్రం ఇప్పటికే మద్దతు ప్రకటించాయి.పంజ్ షేర్ ఎలాగైనా తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు తాలిబన్లు దండెత్తి తున్నారు మసాద్ నాయకత్వంలోని పంజ్ షేర్ దళం గట్టిగా ప్రతిఘటించింది.
ఈ దాడిలో 350 మంది మరణించారు.