తాలిబన్లు నల్లమందు సాగును ఎందుకు నిషేధించారంటే..

తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్‌లో ఇటీవల నల్లమందు, ఇతర మాదక ద్రవ్యాల సాగును నిషేధించారు.ఈ సాగు హెరాయిన్ తరహా మాదకద్రవ్యాలకు ముడిసరుకును అందిస్తుంది.

 Taliban Bans Opium Cultivation In Afghanistan Details, Talibans, Afghanisthan, O-TeluguStop.com

ప్రపంచంలోని చాలా దేశాల్లో వీటిని నిషేధించారు.దక్షిణ ఆఫ్ఘనిస్తాన్‌లో నల్లమందు పండించే సీజన్‌లో ఈ నిషేధం అమలయ్యింది.

తాలిబాన్ అంతర్జాతీయ సహకారం కోసం ఎదురుచూస్తుండగా, నల్లమందు సాగును ఎంచుకున్న ఆఫ్ఘన్ రైతులు పెద్ద తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు.తాలిబన్లు.

అక్కడి రైతులు నల్లమందు సాగుచేస్తే వారిని జైలుకు పంపి, వారి నల్లమందు పంటను కాల్చివేస్తామని హెచ్చరించారు.నల్లమందుతో పాటు, హెరాయిన్, హషీష్, మద్యం వ్యాపారం కూడా నిషేధించారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో నల్లమందు ప్రధాన ఆర్థిక వనరు.ఇది ఆఫ్ఘనిస్తాన్‌లో లక్షలాది మందికి ఉపాధి, ఆదాయాన్ని అందిస్తోంది.

ఇక్కడ లక్షలాది మంది రైతులు నల్లమందు పంటపై ఆధారపడి జీవిస్తున్నారు.ఆగస్టు 2021లో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ మళ్లీ అధికారం చేపట్టిన తర్వాత, అంతర్జాతీయ సహాయాన్ని నిలిపివేయడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది.

అనేకమంది ఉద్యోగాలు కూడా కోల్పోయాయి.ఆహారం కొనుగోలుకు అక్కడి ప్రజల వద్ద తగినంత డబ్బు లేనందున ఆఫ్ఘనిస్తాన్‌లో ఆకలి కేకలు కొనసాగుతున్నాయి.ఈ సమస్యలు తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని మానవతావాద సంస్థలు హెచ్చరించాయి.ఆఫ్ఘన్ మీడియా ఔట్‌లెట్ టోలో న్యూస్ నివేదిక ప్రకారం, నల్లమందుపై నిషేధం కారణంగా రైతులకు ప్రత్యామ్నాయ వ్యాపారాన్ని తెలియజెప్పడంలో సహాయపడాలని ఉప ప్రధాన మంత్రి అబ్దుల్ సలామ్ హనాఫీ అంతర్జాతీయ దాతలను కోరారు.

యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆఫ్ డ్రగ్స్ అండ్ క్రైమ్ తెలిపిన వివరాల ప్రకారం.

Telugu Afghanisthan, Opium, Opium Farmers, Taliban, Talibans-General-Telugu

ఆఫ్ఘనిస్తాన్. ప్రపంచంలోని నల్లమందు ఉత్పత్తిలో 80 శాతం వాటాను అందిస్తుంటుంది.ఈ విధంగా ఆఫ్ఘనిస్తాన్ సంవత్సరానికి కనీసం $1.6 బిలియన్లను సంపాదిస్తుంది.నల్లమందు వ్యాపారాన్ని ఆఫ్ఘనిస్తాన్ నిషేధించడం ఇదే మొదటిసారి కాదు.దీనికి ముందు, 1994 మరియు 1995లో కూడా తాలిబన్లు నల్లమందు వ్యాపారాన్ని నిషేధించారు.2001లో తాలిబాన్ల ఉపసంహరణతో నిషేధం రద్దు అయ్యింది.మాదకద్రవ్యాల వ్యాపారంపై నియంత్రణ అంతర్జాతీయ సంస్థల ప్రధాన డిమాండ్.తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్‌లో ఆగస్ట్ 2021లో అధికారంలోకి వచ్చింది.దేశంలోని బ్యాంకింగ్, వాణిజ్యం, అభివృద్ధి కార్యకలాపాలకు ఆటంకంగా ఉన్న ఆంక్షలను ఎత్తివేయడానికి అంతర్జాతీయ ఆమోదాన్ని కోరుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube