హ‌రిత హారం మ‌న బాధ్య‌త ః త‌ల‌సాని

మొక్కలు పెంచుకోవడం సామాజిక బాధ్యతగా గుర్తెరగాలని, దీనిని రాజ‌కీయ కోణంలో చూడాల‌నుకుంటే జ‌నం తిప్పికొడ‌తార‌ని తెలంగాణ మం్ర‌తి త‌ల‌సాని శ్రీ‌నివాస‌యాద‌వ్ వ్యాఖ్యానించారు.

శ‌నివారం ఆయ‌న త‌న నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, మారుతున్న వాతావ‌ర‌ణంతో స‌కాలంలో వ‌ర్షాలు కుర‌వ‌ట్టేద‌ని, దీంతో అనేక స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నందునే ప్ర‌భుత్వం వాటిని తీర్చేందుకే హ‌రిత హారం కార్య్ర‌క‌మాన్ని చేప‌ట్టిన‌ట్టు చెప్పారాయ‌న‌.

ప్ర‌తి విష‌యాన్ని రాజ‌కీయ‌కోణంలో చూడ‌టం విప‌క్షాల‌కు అల‌వాటుగా మారింద‌ని, ఏదో ఒక‌టి విమ‌రి్శంచ‌డ‌మే వారి ప‌ని, వాటిని ప‌ట్టించుకోవ‌ద్ద‌ని సూచించారు.మొక్కల పెంపకం వల్ల మానవ మనుగడకు ఎన్నో లాభాలున్నాయని, భావి తరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి పౌరుడు మొక్కల పెంపకం కర్తవ్యంగా భావించాలని పిలుపునిచ్చారు.

హరితహారం కార్యక్రమంలో భాగంగా అన్ని వీధుల్లో మొక్కలు నాటే కార్యక్రమానికి పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు, ప్రజలు సహకరించాలని, దీనికి పార్టీలకతీతం గా అన్ని వర్గాల వారు కలసి రావాలని కోరారు.

ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు
Advertisement

తాజా వార్తలు