ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని విధంగా వైసీపీ దూసుకు వచ్చింది.విశాఖ స్టీల్‌ప్లాంట్ సెగ తాకి కాస్త మాడిపోతుందని భావించిన పంక గుర్తు స్పీడ్‌కు ప్రతిపక్షాలు ఎండిపోయిన ఆకుల్లా ఎగిరి పోయాయి.
ప్రతి చోట ఉత్కంఠంగా సాగిన ఎన్నికల ఫలితాల పోరులో తుదకు విజయం వైసీపీనే వరించింది.ఈ నేపధ్యంలో తాడిపత్రి మున్సిపల్ రాజకీయం చాలా ఆసక్తికరంగా మారింది.
ముసుగుల గుద్దులాటగా సాగుతున్న రాజకీయ వ్యవహారంలో టీడీపీ ఎత్తులను వైసీపీ చిత్తు చేస్తుందా లేదా అనేది తెలియవలసి ఉంది.కాగా తాడిపత్రి మున్సిపాలిటీలో 36 వార్డులుండగా, ఇద్దరు కౌన్సిలర్ల మద్దతుతో కలిపి టీడీపీ బలం 20 కి చేరింది.
అయితే తమకు ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఓటు అదనంగా ఉందని అంటున్న టీడీపీ, ఇక్కడి ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటామనే ధీమాలో ఉంది.
అయితే ఇక్కడ మ్యాజిక్ మార్క్ 19 గా ఉంది.
ఈ క్రమంలో వైసీపీ కొత్త ఎత్తులకు వెళ్లుతుంది.ఇందులో భాగంగా ఎక్స్ ఆఫీషియో ఓట్లతో తాడిపత్రిని కైవసం చేసుకునే వ్యూహం వైపు అడుగులు వేస్తుంది వైసీపీ.
ఈ దశలో 16 మంది కౌన్సిలర్లతో ఉన్న వైసీపీ, అనంతపురం ఎంపీ, తాడిపత్రి ఎమ్మెల్యే ఎక్స్ ఆఫీషియో ఓట్లతో కలిపి 18 కి చేరింది.ఇలాంటి ఉత్కంఠ పరిస్దితుల్లో తాడిపత్రి ఛైర్మన్ పీఠం ఎవరు దక్కించుకుంటారనే ఆసక్తి నెలకొంది.