వచ్చే ఎన్నికల్లో నా టికెట్ కూడా ఇంకా ఖరారు కాలేదని.తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే,టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
శింగనమల నియోజకవర్గ ఇన్ ఛార్జి బండారు శ్రావణి జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.శ్రావణి కేక్ చేసిన అనంతరం జేసీ, ఆమెను అశీర్వదించారు.
ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఎవరు పార్టీ కోసం పని చేసి ఉంటారో వారికే టికెట్ ఇస్తారన్నారు.తాను టికెట్ ఇచ్చే స్టేజ్ లో లేనని.
నా టిక్కేట్టే ఇంకా ఖరారు కాలేదన్నారు. కొత్త వారికి ఎక్కువగా టికెట్లు ఇచ్చే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
మరోవైపు బండారు శ్రావణి శింగనమల నియోజకవర్గానికి సరైన అభ్యర్థి అని ఆమెకు నా మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.