విజయ్ దేవరకొండ సమంత లీడ్ రోల్ లో శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఖుషి. సమంత అనారోగ్యం కారణంగా సినిమా షూటింగ్ కొంతకాలం బ్రేక్ ఇచ్చారు.
ఈలోగా విజయ్ తన నెక్స్ట్ సినిమా గౌతం తిన్ననూరి సినిమాని కొంత పార్ట్ షూట్ చేయాలని చూస్తున్నారు.విజయ్, సమంతల ఖుషి సినిమా కూడా లవ్ స్టోరీగా రాబోతుంది.
అయితే ఈ సినిమాలో సర్ ప్రైజింగ్ గా ఒక సీనియర్ యాక్ట్రెస్ నటిస్తుందని తెలుస్తుంది.సినిమాలో ఆమె పాత్రని ఇప్పటివరకు రివీల్ చేయలేదని టాక్.
ఇంతకీ ఖుషి సినిమాలో నటిస్తున్న ఆ హీరోయిన్ ఎవరంటే టబు అని తెలుస్తుంది.తెలుగు సినిమాలతో సూపర్ పాపులర్ అయ్యి ఆ తర్వాత బాలీవుడ్ లో స్టార్ గా ఎదిగిన టబు ఈమధ్య మళ్లీ తెలుగు సినిమాల్లో కనిపిస్తుంది.
అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలో నటించిన ఆమె విజయ్ దేవరకొండ ఖుషి సినిమాలో కూడా సమంతకి తల్లి పాత్రలో కనిపిస్తుందని తెలుస్తుంది.ఈ సినిమాలో టబు పాత్ర కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని అంటున్నారు.
సమంత మళ్లీ తిరిగి షూటింగ్ లో పాల్గొంటే సినిమా పూర్తి చేసి రిలీజ్ చేయాలని చూస్తున్నారు మేకర్స్.







