నా జీవితం ఎందుకు ఇంతా దారుణంగా తయారైయింది : తాప్సీ

ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఝుమ్మంది నాదం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన తాప్సీ పలు తెలుగు సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

అయితే తాప్సీకి ప్రస్తుతం తెలుగు సినిమాలలో అవకాశాలు రాక పోయినప్పటికీ బాలీవుడ్, తమిళ సినిమాలలో ఈమెకి వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్నారు తాప్సీ.ఒకవైపు కమర్షియల్ పాత్రలలో నటిస్తూ మరోవైపు లేడీ ఓరియంటెడ్ పాత్రలలో నటిస్తూ ఎంతో గుర్తింపు సంపాదించుకున్న తాప్సీ తాజాగా ప్రముఖ దర్శకుడు ఆకాష్‌ ఖురానా దర్శకత్వంలో ‘రష్మీ రాకెట్‌’ చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

తాజాగా ఈ చిత్ర నిర్మాణం పూర్తి కావడంతో తర్వాత తన చిత్రం ఆకాష్ భాటియా దర్శకత్వంలో ‘లూప్‌ లపేటా’ చిత్రీకరణలో పాల్గొన్నారు.ఈ చిత్ర నిర్మాణంలో పాల్గొన్న నటి తాప్సీ తాజాగా సోషల్ మీడియా వేదిక ద్వారా తన ఫస్ట్ లుక్ ను అభిమానులతో పంచుకున్నారు.

ఈ సందర్భంగా తాప్సీ మాట్లాడుతూ.

Advertisement

హాయ్‌.నేను సవి! ఎవరి జీవితంలో అయినా కొన్నిసార్లు మన జీవితాన్ని మనమే ప్రశ్నించుకోవలసిన పరిస్థితులు ఏర్పడతాయి.ప్రస్తుతం నా జీవితంలో కూడా అలాంటి ప్రశ్న ఎదురయింది.

అసలు నేను ఈ స్థితికి ఎందుకు వచ్చాను! అసలు నా జీవితం ఇంత గందరగోళంలో ఎందుకు పడింది అంటూ ఈ సందర్భంగా తను నటించబోయే సినిమాలో తన పాత్ర గురించి కొంతవరకు చెప్పకనే చెప్పింది.ప్రస్తుతం తాప్సీ నటిస్తున్న ఈ చిత్రం ఓ జర్మన్‌ చిత్రం ‘రన్‌ లోలా రన్‌’కి ఇది హిందీ రీమేక్‌.

ఆకాష్ భాటియా ఈ చిత్రాన్ని ఒక డార్క్ థ్రిల్లర్ చిత్రం గా తెరకెక్కిస్తున్నారు.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు