మన దేశంలో మీ టూ ఉద్యమం ఎంత ఉద్రిక్తంగా మారిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.ఒక్క ఛాన్స్ అంటూ అవకాశం కోసం వచ్చిన నటిల అవసరాన్ని అదునుగా తీసుకొని పక్కలోకి రమ్మని చీప్ గా బిహేవ్ చేసారు కొంత మంది సినిమా వాళ్ళు.
సినిమా హీరోయిన్లు సినిమాల్లో గ్లామర్ ఒలకపోస్తారని నిజజీవితంలో కూడా అలాగే ఉంటారని కొంతమంది అవివేకులు భావిస్తూ ఉంటారు.సోషల్ మీడియా వేదికగా చిల్లర కామెంట్స్ చేస్తూ ఉంటారు.
అలాంటి ఒక కామెంట్ కి తన స్టైల్ లో కౌంటర్ ఇచ్చింది తాప్సి.వివరాలలోకి వెళ్తే.

అకు పాండే అనే ఓ నెటిజన్ తాప్సీని ట్యాగ్ చేసి ‘ఐ లవ్ యువర్ బాడీ పార్ట్స్’ అంటూ ట్విట్టర్ ద్వారా మెసేజ్ చేశాడు.దీంతో తాప్సి ‘వావ్.నాకు కూడా అవంటే చాలా ఇష్టం.ఇంతకీ నీ ఫేవరేట్ ఏంటి.? నాకైతే సెరిబ్రం (మస్తిష్కం)’ అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది.