మునుగోడు ఉపఎన్నిక బరిలో తెలంగాణ టీడీపీ నిలవనుంది.ఈ విషయాన్ని ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు.
కాగా మునుగోడు పోటీలో నిలబడేందుకు అభ్యర్థిగా జక్కలి ఐలయ్య యాదవ్ పేరును పార్టీ ఖరారు చేసింది.ఈ నేపథ్యంలో అభ్యర్థి పేరును చంద్రబాబు రేపు అధికారికంగా ప్రకటించనున్నారు.
అనంతరం ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.







