పేరు వాడుకున్నందుకు కోటి కట్టండి

తమిళంలో దర్శకుడిగా, నటుడిగా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు టి.రాజేందర్‌.

ఈయన గురించి తాజాగా తమిళంలో వచ్చిన ‘రోమియో జూలియెట్‌’ సినిమాలో అనుచితంగా చూపించడం జరిగింది.నేరుగా రాజేందర్‌ పేరును ప్రస్థావించడంతో వివాదం మొదలైంది.

తన పేరును, తన గురించి తన అనుమతి లేకుండా వాడుకున్నందుకు రాజేందర్‌ సదరు నిర్మాణ సంస్థ మరియు దర్శకుడిపై చాలా సీరియస్‌ అవుతున్నాడు.జయం రవి, హన్సిక జంటగా నటించిన ‘రోమియో జూలియెట్‌’ సినిమాలో రాజేందర్‌ ఇమేజ్‌కు భంగం వాటిల్లేలా కొన్ని సీన్స్‌ మరియు డైలాగ్స్‌ ఉన్నాయి.

ఆ సీన్స్‌పై ఇప్పుడు రాజేందర్‌ సీరియస్‌ అవుతున్నాడు.తనకు జరిగిన ఇమేజ్‌ డ్యామేజ్‌కు కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలంటూ డిమాండ్‌ చేస్తున్నాడు.

Advertisement

డండనక అనే పాటలో రాజేందర్‌పై విమర్శలు చేయడం జరిగింది.ఆ పాటను తొలగించినా కూడా రాజేందర్‌ శాంతించినట్లుగా లేదు.

కోటి రూపాయల నష్ట పరిహారం ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్‌ చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు