తెలంగాణలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తుంది.ఇందులో భాగంగా తెలంగాణ బీజేపీ రాష్ట్రంలో బస్సు యాత్ర చేయాలని సంకల్పించిన విషయం తెలిసిందే.
అయితే ఈ బస్సు యాత్రకు విజయసంకల్ప రథయాత్రగా నామకరణం చేసినట్లు తెలుస్తోంది.కాగా రాష్ట్రంలో మొత్తం మూడు ప్రాంతాల నుంచి బీజేపీ రథయాత్రలు ప్రారంభంకానున్నాయి.
ఈ మేరకు భద్రాచలం, బాసర, సోమశిల నుంచి ఈనెల 26, 27, 28 వ తేదీల్లో విజయసంకల్ప రథయాత్రలు ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై తెలంగాణ బీజేపీ నేతలు ప్రత్యేక దృష్టి సారించారని సమాచారం.