టీడీపీ పైన ,ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ( N Chandrababu Naidu ) లోకేష్ పైన ఎప్పుడూ ఏదో ఒక విమర్శ చేస్తూ వార్తల్లోనే ఉంటూ ఉంటారు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. చంద్రబాబు ను ఇరుకుని పెట్టే విధంగా అనేక సినిమాలు వర్మ తీశారు.
ఇక తాజాగా చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో అరెస్ట్ అయిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మ యాక్టివ్ గా ఉంటూ తనదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రాంగోపాల్ వర్మ( Ramgopal Varma ) 9 ప్రశ్నలు స్పందించి , దానికి ఏకవాక్యంలో సమాధానం చెప్పాలంటూ సవాల్ చేశారు.
ఇదిలా ఉండగానే మరోసారి ప్రజలను ఉద్దేశించి వర్మ సెటైర్లు వేశారు.

” మై నాట్ డియర్ ఏపీ ప్రజలారా , 40 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా మీకు పగలు రాత్రి సేవ చేసిన వారిని లోపలికేసినందుకు బందుకు పిలుపు ఇస్తే , ఏమాత్రం కేర్ చేయకుండా మీ పనులు చేసుకుంటూ సినిమాలు చూసుకుంటూ షాపింగ్ లు చేసుకున్నారా ??? అవ్వా !!! ఇంతకన్నా వెన్నుపోటు ఉంటుందా “‘ అంటూ వర్మ ప్రశ్నించారు. చంద్రబాబు ( Chandrababu )అరెస్టుకు నిరసనగా నిన్న తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించగా, అది పూర్తిస్థాయిలో సక్సెస్ కాకపోవడం,యథావిధిగా షాపులు తెరుచుకోవడం, బస్సులు తిరగడం వంటివి జర్8గాయి.

బంద్ పై జనాల్లో అంత ఆసక్తి లేనట్లుగా పరిస్థితి ఉండడంతో, దీనిని హైలెట్ చేసుకుని వర్మ ప్రజలను ప్రశ్నిస్తూ చంద్రబాబు పై పరోక్షంగా సెటైర్లు వేశారు.వర్మ పెడుతున్న ట్వీట్స్ కి నెటిజెన్లు సైతం రకరకాలుగా స్పందిస్తున్నారు.టిడిపి, ( TDP )జనసేన అభిమానులు వర్మ పోస్ట్ లను తప్పుబడుతూ తిట్టిపోస్తూ ఉండగా, వైసీపీ అభిమానులు మాత్రం వర్మ ట్వీట్ లను సమర్ధిస్తూ కామెంట్స్ పెడుతున్నారు.
ఇక వర్మ చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం లో ఇంకెన్ని విధాలుగా సెటైర్ లు వేస్తూ ట్వీట్స్ చేస్తారో
.






