మీరు శీతల పానీయాలు తాగుతున్నారా? అయితే ఈ ముప్పు నుంచి తప్పించుకోలేరు!

మీరు శీతల పానీయాలను తెగతాగుతూ ఉంటే ఇకపైనైనా అప్రమత్తంగా మెలగండి.ఈ డ్రింక్‌లో ఉపయోగించే కృత్రిమ స్వీటెనర్లు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.

 Sweeteners Used In Food And Drink Raise The Risk Of Cancers ,sweeteners , Drink-TeluguStop.com

ఫ్రాన్స్ శాస్త్రవేత్తలు లక్ష మందిపై జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది.కృత్రిమ తీపి పదార్థాలతో తయారుచేసిన పానీయాలను రోజూ తాగేవారిలో క్యాన్సర్ ముప్పు 13 శాతం ఎక్కువగా ఉంటుందని 8 ఏళ్లపాటు సాగిన పరిశోధనలో వెల్లడైంది.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ మెడికల్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు.పలు శీతల పానీయాలలో అస్పర్టేమ్, ఎసిసల్ఫేమ్-కె కృత్రిమ స్వీటెనర్‌లను ఉపయోగిస్తున్నారని, ఇవి క్యాన్సర్ కారకాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

యూకేలో, డైట్ కోక్, కోక్ జీరో, పెరుగు మొదలైన పదార్థాల తయారీలో అస్పర్టేమ్ , ఎసిసల్ఫేమ్-కె వంటి కృత్రిమ స్వీటెనర్లను ఉపయోగిస్తారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ రెండు స్వీటెనర్లను కలిగి ఉన్న పానీయాలు అనారోగ్యాన్ని కలిగిస్తాయి.

డెయిలీ మెయిల్ నివేదిక ప్రకారం 42 సంవత్సరాల సగటు వయస్సు గల లక్ష మందిపై ఈ పరిశోధనలు సాగించారు.వీరిలో మూడోవంతు మంది మహిళలు ఉన్నారు.8 సంవత్సరాల పాటు శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో పాల్గొన్న వ్యక్తుల ఆహారాన్ని పరిశీలించారు.పరిశోధన పూర్తయ్యే సమయానికి 3,358 మందిలో క్యాన్సర్ ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.

వీరిలో 982 మంది బ్రెస్ట్ క్యాన్సర్‌తో, 403 మంది ప్రొస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.అదే సమయంలో, ఊబకాయానికి సంబంధించిన క్యాన్సర్ కేసులు 2,032 మందిలో నమోదయ్యాయి.79 మిల్లీగ్రాముల కంటే అధిక కృత్రిమ స్వీటెనర్లను కలిగి ఉన్న డ్రింక్స్‌తో క్యాన్సర్ వచ్చే ప్రమాదం 13 శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధన నివేదికలు చెబుతున్నాయి.శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం, పానీయాలలో అస్పర్టేమ్, ఎసిసల్ఫేమ్-కె వంటి కృత్రిమ స్వీటెనర్లు సాధారణ చక్కెర కంటే 20 రెట్లు ఎక్కువ తీపిని ఉత్పత్తి చేస్తాయి.

ఫలితంగా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube