మొక్కజొన్న కంకులతో మనకు ఎంత మేలో తెలుసా..?!

మనం ఎదో సరదాకి సాయంత్రం పూట తినే మొక్కజొన్కంకి వలన మనకి తెలియని ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

వాటి గురించి తెలుసుకుంటే మీరు తప్పకుండా షాకవుతారు.

మరి ముఖ్యంగా వర్షం పడుతున్నప్పడు కాల్చిన మొక్కజొన్న కంకులు తింటే వచ్చే కిక్కే వేరుగా ఉంటుంది కదా.! అయితే ఇన్ని రకాలుగా తినే మొక్కజొన్నతో శరీరానికి ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసుకుందాం.! మొక్కజొన్న కంకిలో విటమిన్‌ బి12, ఫోలిక్‌ యాసిడ్‌, ఐరన్‌ సమృద్ధిగా ఉంటాయి.

ఇవి దేహంలో ఎర్రరక్త కణాలను ఉత్పత్తికి ఎంతో సహాయపడతాయి.వీటిని తినడం వలన రక్త హీనత అనేది ఉండదు.

అథ్లెటిక్‌ క్రీడాకారులకు, జిమ్‌ లో చెమటలు చిందించేవారికి మొక్కజొన్న కంకులు తినడం వలన తక్షణ శక్తి వస్తుంది.అలాగే మొక్కజొన్నలో బి విటమిన్‌ కుటుంబానికి చెందిన బి1, బి5 లతో పాటు విటమిన్‌ సి, ఫాస్ఫరస్‌, మెగ్నీషియం, మాంగనీస్‌, జింక్‌, కాపర్‌, ఐరన్‌, సెలీనియం పుష్కలంగా ఉంటాయి.

Advertisement

అందువల్ల బీపీ, గుండె జబ్బులు, అల్జీమర్స్‌ వంటి వ్యాధులను నివారిస్తుంది.మధుమేహం ఉన్నవారు మొక్కజొన్న కండి తినడం వలన ఎంతో మేలు జరుగుతుంది.

అలాగే గర్భవతులు మొక్కజొన్న కండి తినడం వలన జరిగే మేలు ఇంతా అంతా కాదు.గర్భిణికి, గర్భస్త శిశువుకు కూడా మొక్కజొన్న వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు.

మొక్కజొన్న గింజలను విస్కీ తయారీలో కూడా విరివిగా వినియోగిస్తున్నారు.మొక్కజొన్న ను బయో గ్యాస్‌ ప్లాంట్లలో వినియోగిస్తున్నారు.

చూసారు కదా మొక్కజొన్న కంకి తినడం వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.మరి కాలక్షేపం కోసం ఎదో ఒకరోజు తినే మొక్కజొన్న కంకిని ప్రతిరోజు తినడం అలవాటు చేసుకోండి.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు