ఈనెల 22న స్వతంత్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకలు నిర్వహించనున్నట్లు వేడుకల కమిటీ చైర్మన్, ఎంపీ కే కేశవరావు తెలిపారు.ఈ నెల 22న ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుండగా.
సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు.వేడుకల్లో భాగంగా 21వ తేదీన పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తారు.
తెలంగాణా జానపద కార్యక్రమాలు, లేజర్ షో ఉంటాయన్నారు.అదేవిధంగా ముగింపు సందర్భంగా క్రాకర్ ప్రదర్శన ఉండనుందని వెల్లడించారు.కార్యక్రమాలన్నీ దేశ స్వతంత్ర పోరాటం, దేశభక్తి ప్రధానంగా ఉంటాయని వివరించారు.ఈ ముగింపు వేడుకలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి దాదాపు 20 వేలకుపైగా హాజరవుతారని కేశవరావు తెలిపారు.