ఇటీవల బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కు ‘వై’ కేటగిరి భద్రత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.దీనిపై ఒక నెటిజన్ స్పందిస్తూ `ఏ నటికైనా ప్రభుత్వం భద్రత కల్పించాలనుకుంటే.
ముందుగా స్వర భాస్కర్‌నే పరిగణనలోకి తీసుకోవాలి.సోషల్ మీడియా వేదికగా ఎన్నో అసభ్యకరమైన, భయంకరమైన బెదిరింపులను స్వర ఎదుర్కొంటోంద`ని కామెంట్ చేశారు.
అయితే ఈ పోస్ట్ పై స్పందించిన స్వర కంగనా లాగా తనకు సెక్యూరిటీ అక్కర్లేదని, ప్రభుత్వ సంపదను అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తే మంచిదంటూ ఆమె సూచించింది.మీకు ధన్యావాదాలు.
కానీ, నాకు ఎలాంటి భద్రత అవసరం లేదు.ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్న వారి డబ్బు మంచి కార్యక్రమాలకు ఉపయోగపడాలి.
ఆ సంపదను అభివృద్ధి కార్యక్రమాలకు, పోషకాహారం కోసం ఉపయోగించాలని సూచిస్తూ ఆమె ట్వీట్ చేశారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఘటన తరువాత కంగనా,శివసేన నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం విదితమే.
ఈ నేపథ్యంలో కంగనా ను ముంబై లో అడుగుపెట్టనీయం అంటూ సేన నేతలు చేసిన వ్యాఖ్యలకు కంగనా సెప్టెంబర్ 9 న ముంబై లో అడుగుపెడుతున్న దమ్ముంటే ఆపండి అంటూ సవాల్ విసరడం తో కేంద్రం ఆమెకు భద్రత ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.రేపు ముంబై రాబోతున్న కంగన కు కేంద్ర ప్రభుత్వం ‘వై’ కేటగిరి భద్రత కల్పించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.