బాలకృష్ణ వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో మాట్లాడిన చిన్న మాటను పట్టుకుని రచ్చ రచ్చ చేస్తున్న వారు కొందరైతే ఆ రచ్చ ఆధారంగా చేసుకుని స్పందించడం కూడా మళ్ళి విషయాన్ని మొదటికి తీసుకువచ్చేలా కనిపిస్తుంది.మామూలుగానే బాలకృష్ణకు ఎక్కడ ఏం మాట్లాడాలో పెద్దగా తెలీదు ఇది అందరికీ తెలుసు తనకైతే బ్లడ్ బ్రీడ్ అనే మాటలు అసలు సూట్ కావు.
కానీ మనం గతంలో చాలా సార్లు చెప్పుకున్నాం మాట్లాడడం సరిగా తెలిసిన వారితో వాధించడంలో అర్థం ఉంది కానీ అసలు ఈ విషయంలో ఎలాంటి వార్త లేదు.పోనీ బాలకృష్ణ ఏదో అనేశాడు… అదొక జనరల్ ఫ్లో… ఎవరిని ఉద్దేశించి హర్ట్ చేయాలని మాట్లాడినవి కాదు.
ఎదో చెబుతూ ఒక మాట ఫ్లోలో అనేసాడు.
జరుగుతుంది లైవ్ అని, మాట్లాడాల్సిన భాష బాగుండాలని బాలకృష్ణకు ఎప్పుడు గుర్తు ఉండదు.
తన ఎంత సేపు తన వారసత్వం, తాను ఒక చిరస్మరణీయుడి కడుపున పుట్టాను కాబట్టి తాను కూడా చిరస్మరణీయుడు అని అనుకుంటూ ఉంటాడు.ఆ వ్యాఖ్యలను చూసిన తర్వాత ఎవరైనా కూడా ఇగ్నోర్ చేయాల్సిందే.
కానీ అక్కినేని వారసులు కాస్త తొందరగా పడ్డారు.బాలకృష్ణ ఏదైనా తప్పుగా మాట్లాడితే తానే ముందుగా క్షమాపణ చెప్తాడు.
మొన్నటికి మొన్న నాయి బ్రాహ్మణుల విషయంలో జరిగిన తప్పుకు తానే పబ్లిక్ గా క్షమాపణ కోరుకున్నాడు.

కానీ ఈసారి అలా జరగడం లేదు ఎందుకంటే తాను ఎప్పుడూ అక్కినేని కి మంచి మర్యాద ఇస్తాడు.బేసిగ్గా తన తత్వం అలాగే ఉంటుంది.తన బ్యాక్ గ్రౌండ్ మీద తనకు ఉన్న గట్టి విశ్వాసం అలాంటిది.
ఇక అక్కినేని వారసుల స్పందన కన్నా ముందు జరిగిన కొన్ని నిరసనలు మనం చూసాం కానీ ఎస్వీ రంగారావు మనవళ్లు మాత్రం బాగా స్పందించారు.ఆయన మాట్లాడిన మాటల యొక్క అర్ధాన్ని మేము అర్థం చేసుకున్నాము.
బాలకృష్ణ మాట్లాడిన విషయం పట్ల మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు.

ఇష్యూ పెద్దది చేయడం వల్ల వచ్చే లాభం లేదు అంటూ సోషల్ మీడియాకే వారు చురకలాంటించే ప్రయత్నం చేశారు.ఈ విధంగానే అక్కినేని వారసులు కూడా స్పందించి ఉంటే ఇంకా బాగుండేది.అక్కడితో విషయం సర్దుమనేది.
ఈ ఫ్యాన్స్ గొడవలు, వీటి వల్ల ఎవరికి ప్రయోజనం లేదు.పైగా బాలకృష్ణ అఖండ సినిమా విజయం సాధించి ఉండకపోతే ఇప్పుడు ఎక్కడ ఉండేవాడు మనం చెప్పాల్సిన అవసరం లేదు.
నాగార్జున పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది.ఈ మాత్రం దానికి ఇంత రచ్చ అవసరమా ?
.