ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.అయితే పంజాగుట్ట పోలీసుల అదుపులో ఉన్న సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావు( Suspended DSP Praneeth Rao ) విచారణకు సహకరించడం లేదు.
ఈ నేపథ్యంలో ప్రణీత్ రావును పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచే అవకాశం ఉందని తెలుస్తోంది.ప్రణీత్ రావు నుంచి సెల్ ఫోన్లతో పాటు గతంలో వాడిన సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కాగా మొత్తం పది లక్షల సంభాషణల డేటాను ప్రణీత్ రావు తొలగించాడని పోలీసులు గుర్తించారు.

ఈ నేపథ్యంలో సెల్ ఫోన్లను ఎఫ్ఎస్ఎల్( FSL ) కు పంపిన పోలీసులు అందులో ఉన్న డేటాను రిట్రైవ్ చేయనున్నారు.విచారణలో భాగంగా ప్రణీత్ రావుకు అక్రమాస్తులున్నట్లు గుర్తించిన పోలీసులు గత అసెంబ్లీ ఎన్నికల్లో( Assembly Elections ) డబ్బుల బదిలీల్లో ప్రణీత్ రావు కీలక పాత్ర పోషించారని నిర్ధారించారు.అదేవిధంగా ఒక సామాజిక వర్గానికి చెందిన ముప్పై మందితో టీమ్ ఏర్పాటు చేసుకున్న ప్రణీత్ రావు యాభై మంది కీలక వ్యక్తుల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు గుర్తించారు.







