జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏలూరు జిల్లా భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్( Bhimavaram MLA Grandhi Srinivas ) విమర్శలు గుప్పించారు.పవన్ కల్యాణ్( Janasena Pawan Kalyan ) చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు.
తరిమితే వెళ్లే వాడిని కాదన్న గ్రంధి శ్రీనివాస్ ప్రజాసేవ తమ బ్లడ్ లోనే ఉందని తెలిపారు.గత ఎన్నికల్లో ప్రజలే పవన్ కల్యాణ్ ను భీమవరం( Bhimavaram ) నుంచి తరిమికొట్టారని ఎద్దేవా చేశారు.
కాపు నేతలు ఎందుకు దూరం అవుతున్నారో జనసేనాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.పార్టీ నేతలకే కాకుండా సొంత అన్న నాగబాబుకు కూడా పవన్ కల్యాణ్ అన్యాయం చేశారని విమర్శించారు.







