మీడియా హడావుడికి ఆస్పత్రి నుండి పారిపోయిన కరోనా పేషెంట్..!

ప్రస్తుతం ప్రపంచాన్ని ఏదైనా వణికిస్తోంది అంటే అది కరోనా వైరస్ ఏ.చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది.

 Suspected Coronavirus Patient Escaped From Hospital Because Of Media-TeluguStop.com

ఇక మొన్నటి వరుకు చైనాలో ఎక్కువ ఉన్న ఈ కరోనా వైరస్ ప్రస్తుతం భారత్ లో కూడా వ్యాపించి ప్రజలను భయానికి గురి చేస్తుంది.ఇప్పటికే ఈ కరోనా వైరస్ కేసులు దాదాపు 30కు చేరాయి.

ఈ కరోనా వైరస్ కు భయపడి ఢిల్లీ, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో కొన్ని స్కూల్స్ కు సేలువలు ప్రకటించారు.

కొన్ని టెక్ సంస్థలు కూడా వారి ఉద్యోగులను ఇంటి నుండే పని చెయ్యాలని ఆదేశించారు.

ఇలా అందరిని భయపెడుతున్న కరోనా వైరస్ పంజాబ్ లో ఓ వ్యక్తిని అలాగే భయపెట్టింది.దీంతో అతను ఆస్పత్రికి వెళ్లి చెకప్ చేయించుకోగా అతనికి చికిత్స చేసిన డాక్టర్లు కరోనా లక్షణాలు ఉన్నాయంటూ ప్రత్యేక వార్డులో ఉంచారు.

అయితే ఈ విషయం తెలుసుకున్న స్థానిక మీడియా ఆ పేషేంట్ ను ఫోటోలు వీడియోలు తీశారు.మీడియా చేసిన హడావుడితో భయపడిపోయిన ఆ పేషెంట్ గుట్టు చెప్పుడు కాకుండా అక్కడి నుండి పారిపోయాడు.

అయితే ఈ విషయం తెలుసుకున్న ఆస్పత్రి సిబ్బంది షాక్ తిని పోలీసులతో అతడి ఇంటికి వెళ్లగా అతను ఆస్పత్రికి వచ్చేందుకు నిరాకరించాడు.అయితే అతని కుటుంబసభ్యులతో చెప్పి ఒప్పించి చివరికి ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ప్రస్తుతం ఆ వ్యక్తి డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాడు.ఇలా కరోనా కంటే కూడా మీడియానే ప్రజలను భయపెడుతుంది అని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube