డ్రగ్స్ కేసులో నిన్న సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ప్రియురాలు రియా చక్రవర్తి అరెస్ట్ అయిన విషయం తెల్సిందే.ఆమె అరెస్ట్ చాలా మందికి ఆశ్చర్యంగా అనిపించలేదు.
ఎందుకంటే ఆమెను సీబీఐ వారు మరియు ఎన్ సీ బీ వారు విచారిస్తున్న తీరు ఆమెను టార్గెట్ చేసిన తీరు చూస్తుంటే ఖచ్చితంగా అరెస్ట్ చేయడం ఖాయం అనుకున్నారు.స్వయంగా రియా చక్రవర్తి తండ్రి ఇంద్రజిత్ కూడా తన కొడుకు అరెస్ట్ అయ్యాడు.
ఇప్పుడు అరెస్ట్ కాబోతున్నది నా కూతురు అంటూ ఆయన పేర్కొన్నాడు.ఆయన ఆ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే రియాను అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
రియా చక్రవర్తి అరెస్ట్ పై ఆమె తరపు లాయర్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
రియా అరెస్ట్ చేయడం అన్యాయం.
సుశాంత్ డిప్రెషన్ తో బాధపడుతున్నాడు.అందుకు అతడు ఇల్లీగల్ మందులు వేసుకున్నాడు.
ఆ మందులను అతడి కుటుంబ సభ్యులు ఇచ్చారు.ఇక అతడు చాలా కాలంగా డ్రగ్ అడిక్ట్ అంటూ విచారణలో తేలిపోయింది.
అతడు డిప్రెషన్ తో డ్రగ్స్ వల్ల ఆత్మహత్య చేసుకుని ఉంటాడు.అలాంటి వ్యక్తిని రియా ప్రేమించింది.
అందువల్ల ఆమె చాలా నష్టపోయింది.ఆ విషయంలో ఆమెకు అన్యాయం జరిగిందంటూ లాయర్ వ్యాఖ్యలు చేశాడు.
రియాను అరెస్ట్ చేయడం కోసం మూడు జాతీయ విచారణ సంస్థలు రంగంలోకి దిగడం జరిగింది అంటూ లాయర్ పేర్కొన్నాడు.
రియా డ్రగ్స్ సరఫరా చేసింది అంటూ చాలా సాక్ష్యాదారాలు లభ్యం అయ్యాయి.
ఇలాంటి సమయంలో ఆమెను అరెస్ట్ చేసినట్లుగా ఎన్‌సీబీ అధికారులు చెబుతున్నారు.ఆమె అరెస్ట్‌ను చాలా మంది వ్యతిరేకిస్తున్నారు.
ఇందులో కేంద్ర ప్రభుత్వంకు సంబంధించి ఏమైనా భాగస్వామ్యం ఉందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా మరికొందరు మాత్రం శివసేనపై కక్షతో బీజేపీ ప్రభుత్వం ఇలా చేస్తుందేమో అనిపిస్తుందని ఇలా చేయడం వల్ల మహారాష్ట ప్రభుత్వంను అస్థిర పర్చే అవకాశం ఉంటుందా అంటూ చాలా మంది విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.అసలు విషయం ఏంటీ అనేది కాలమే జనాలకు చూపించబోతుంది.