వన్డేల్లో సూర్యకుమార్ యాదవ్ అత్యంత చెత్త రికార్డు.. నెటిజన్స్ ఫైర్..!

సూర్య కుమార్ యాదవ్( Surya Kumar Yadav ) అంటే టీ20 ( T20 )ఫార్మాట్లో నెంబర్ వన్ ప్లేయర్.కానీ వన్డేల్లో మాత్రం అట్టర్ ప్లాప్.

 Suryakumar Yadav Worst Record In Odis Netizens Fire , Suryakumar Yadav ,odi, T2-TeluguStop.com

తాజాగా భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన 3 వన్డే సిరీస్ లలో హ్యాట్రిక్ డక్ అవుట్ లను ఖాతాలో వేసుకున్నాడు.అంతేకాదు మొదటి బంతికే వరుసగా మూడుసార్లు అవుట్ అయిన భారతీయ బ్యాటర్ గా సూర్య కుమార్ యాదవ్ చెత్త రికార్డ్ ఖాతాలో వేసుకోవడం అభిమానులలో నిరాశను నెలకొల్పింది.

భారత జట్టులో అవకాశం దొరకడం ఎంత కీలకమో అందరికీ తెలిసిందే.వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటేనే భవిష్యత్తులో జట్టులో స్థానం దక్కుతుంది.

కానీ సూర్య కుమార్ యాదవ్ చేతికొచ్చిన అవకాశాన్ని చేజేతులా నాశనం చేసుకున్నాడు.

మొదటి రెండు మ్యాచ్లలో మిచెల్ స్టార్క్ బౌలింగ్లో మొదటి బంతికే ఎల్బీడబ్ల్యూ( LBW ) ద్వారా వెనుదరిగి సోషల్ మీడియాలో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాడు.కొంతమంది సపోర్ట్ గా మాట్లాడితే.మరి కొంతమంది తో వరుస విమర్శలు అందిపుచ్చుకున్నాడు.

కీలకమైన మూడో మ్యాచ్లో కూడా సూర్య కుమార్ యాదవ్ మొదటి బంతికే అస్టన్ అగర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యి ఒక్క పరుగు కూడా చేయకుండా వెనుతిరిగాడు.

టీ 20లో నెం.1 ప్లేయర్, వన్డేల్లో ఒక్క పరుగు కూడా చేయకుండా వరుసగా మూడు గోల్డెన్ డకౌట్ల( Golden ducks )ను ఖాతాలో వేసుకోవడం చాలా బాధాకరం.కానీ సూర్యకుమారి యాదవ్ కంటే ముందు సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, ఇషాంత్ శర్మ, జహీర్ ఖాన్, జస్ ప్రీత్ బుమ్రాలు ఉండడంతో, వరుసగా మూడుసార్లు డక్ ఔట్ అయినా ఆరవ భారతీయ ప్లేయర్ గా రికార్డు ఖాతాలో వేసుకున్నాడు.

సూర్య కుమార్ యాదవ్ కేవలం టీ20 ఫార్మాట్ కే పరిమితమా, మిగతా ఫార్మాట్ లకు పనికిరాడ అని సోషల్ మీడియాలో అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, సూర్య స్థానంలో సంజూ శాంసన్ కు అవకాశాలు ఇవ్వాలని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube