సూర్య, చెర్రీ కాంబినేషన్లో భారీ మల్టీస్టారర్ సినిమా.. దర్శకుడు ఎవరో తెలుసా?

టాలీవుడ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్, బాహుబలి లాంటి సినిమాల తరువాత టాలీవుడ్ మూవీ మేకర్స్ పై భారీగా అంచనాలు ఎలా ఉన్నాయి.దీంతో ప్రస్తుతం బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీలోని అగ్ర నటులు సైతం టాలీవుడ్ స్టార్ నటులతో తెర పంచుకోవడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు.

 Surya Ram Charan Multi Starrer Movie ,surya, Ram Charan, Hanu Ragahavapudi, Mult-TeluguStop.com

అందుకు ఉదాహరణగా చెప్పుకుంటే ఇటీవలె గాడ్ ఫాదర్ సినిమాతో చిరంజీవితో పాటు సల్మాన్ ఖాన్ కూడా స్క్రీన్ షేర్ చేసుకునే విషయం తెలిసిందే.

అలాగే ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమాలో ప్రభాస్ తో పాటు మలయాళ నటుడు పృథ్వీరాజ్ కుమారన్ స్క్రీన్ ను పంచుకోబోతున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం భారీ బడ్జెట్ తో క్రేజీ కాంబినేషన్లో మరొక ప్రాజెక్టు కూడా జరగకపోతున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

Telugu Multi Starrer, Prabhas, Ram Charan, Surya, Suryaram-Movie

హను రాఘవపూడి భారీ బడ్జెట్ తో మల్టీ స్టారర్ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.ఇందుకోసం కోలీవుడ్ నటుడు సూర్య తో సంప్రదింపులు జరపగా ఫైనల్ వర్షన్ స్టోరీని సూర్యకు చెప్పడంతో సూర్య అందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది.

Telugu Multi Starrer, Prabhas, Ram Charan, Surya, Suryaram-Movie

అయితే ఇందులో కీ రోల్ కోసం ఎవరిని తీసుకోవాలని డిస్కషన్ జరగగా రామ్ చరణ్ అయితే బాగుంటుందని సూర్య హను రాఘవపుడికి సూచించాడట.మరి రామ్ చరణ్ కి ఈ కథ నచ్చుతుందా లేదా ఈ ప్రాజెక్టుకి రాంచరణ్ గేమ్స్ సిగ్నల్ ఇస్తాడు లేదో చూడాలి మరి.ఇదే గతంలో రామ్ చరణ్ తో హను రాఘవపూడి ఒక సినిమా చేయాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే.ఇకపోతే రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో నటిస్తూ మరికొన్ని ప్రాజెక్టులను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube