పార్లమెంట్ సమావేశాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ప్రారంభమైన సంగతి తెలిసిందే.రాష్ట్రపతి ప్రసంగం అనంతరం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు.
రేపు ఉభయసభలో ఆమె వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.గత సంవత్సర ఖాతాలను, వచ్చే సంవత్సరానికి సంబంధించిన సవాళ్లను ప్రస్తావించనుంది ఆర్థిక సర్వే.
దీనిని ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు పర్యవేక్షణలో ప్రతి ఏడాది రూపొందిస్తుంటారు.కాగా సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను ఆఖరు సారి ప్రవేశపెట్టనుందన్న విషయం తెలిసిందే.







