పెద్ద పెద్ద ఎన్నికలను ఎదుర్కొని నిలిచిన చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు సొంత నియోజకవర్గంలో జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికలు పెద్ద సవాలును విసురుతున్నాయి.అంత చిన్న మున్సిపాలిటీ కోసం ఏకంగా చంద్రబాబు రంగంలోకి దిగాల్సి వస్తోంది.
ఎందుకంటే ఇక్కడ వైసీపీ ఇస్తున్న షాక్ లు అలా ఉన్నాయి మరి.ఇప్పటికే స్థానిక సంస్థ ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ జెండా ఎగిరింది.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యూహాలతో టీడీపీ దారుణమైన ఓటమిని మూటగట్టుకుంటోంది.దీంతో చంద్రబాబు అసలుకే ఎసరు వస్తోందని గ్రహించారు.
అందుకే ఈసారి ఆ ఛాన్స్ వైసీపీకి ఇవ్వొద్దని తానే స్వయంగా రంగంలోకి దిగిపోయారు.కుప్పంలో తన బలాన్ని తగ్గించుకోకూడదన్న ఆలోచనతో ఆయనే ప్రచారానికి వస్తున్నారు.అయితే రాష్ట్రంలో జరుగుతన్న మిగతా మున్సిపాలిటీ ఎన్నికల కంటే కూడా కుప్పం ఎన్నికలే కీలకంగా మారాయి.ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మున్సిపాలిటీల్లోఏ పార్టీ ఎన్ని వార్డులు గెలుస్తుందో పీపుల్స్ పల్స్ ఏజెన్సీ చెప్పేసిది.ఇందులో చూస్తే మొత్తం 25 వార్డుల్లో అంచానాలు వేస్తోంది.

ఇందులో 14 వార్డుల్లో వైసీపీ గెలిస్తే టీడీపీ మాత్రం కేవలం 4 వార్డుల్లోనే గెలుస్తుందని చెప్పేసింది.ఇక మిగతా 7 వార్డుల్లో ఇరు పార్టీల నడుమ గట్టి పోటీ ఉంటుందని చెబుతోంది ఈ సర్వే.దీంతో ఇప్పుడు ఇది కాస్తా టీడీపీకి పెద్ద టెన్షన్ గా మారిపోయింది.
ఈ ఫలితాలను చూస్తుంటే చంద్రబాబుకు కుప్పం చేజారిపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.ఒకవేళ కుప్పంలో గనక చంద్రబాబు కన్నా వైసీపీ ఎక్కువ సీట్లు సాధిస్తే మాత్రం అది టీడీపీకి పెద్ద షాక్ అనే చెప్పాలి.
ఇది రాబోయే ఎన్నికల్లో తప్పకుండా చంద్రబాబుకు పెద్ద పరాభవాన్ని చూపిస్తుందని తమ్ముళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
.