చేపలలో కూడా సరోగసీ.. ఎలా జరుగుతుందంటే...

తల్లి ప్రేమ గురించి చాలా రాస్తుంటాం.అలాగని తండ్రి అంకితభావాన్ని కూడా విస్మరించలేం.

 Surrogacy In Fish Too How It Happens , Mouth Brooding, Male Fish, Fish Eggs, Cha-TeluguStop.com

అది మనుషులైనా, జంతువులైనా… ఇప్పుడు మనం చేపలలో సంతాన ప్రేమ గురించి తెలుసుకుందాం.ముఖ్యంగా మగ చేపలు సంతాన సాఫల్యానికి, అంకితభావానికి ప్రత్యేకమైన ఉదాహరణగా నిలుస్తాయి.

చేప గుడ్లు పెట్టినప్పుడు, మగ చేప ఆ గుడ్లను తన నోటిలో భద్రంగా ఉంచుకుంటుంది.ఆ గుడ్లను నోటిలోనే పొదుగుతుంది.

నోటిలో గుడ్లు ఉన్నంత వరకు ఆ చేపలు ఏమీ తినలేవు.ఇలా అవి చాలా వారాల పాటు ఏమీ తినకుండా ఉంటాయి.

తద్వారా గుడ్లు సురక్షితంగా ఉంటాయి.ఈ ప్రక్రియను మౌత్ బ్రూడింగ్ అంటారు. ఈ మగ చేపలు కేవలం తమ గుడ్ల కోసమే కాకుండా ఇతర చేపల గుడ్లను కూడా ఇలాగే నోటిలో పెట్టుకుంటాయని తెలిస్తే మరింత ఆశ్చర్యం కలుగుతుంది.సరోగసీ ద్వారా మనుషుల్లో వేరొకరి బిడ్డను ఇంకొకరి కడుపులో పెంచినట్లు, మగ చేపలు ఇతర చేపల గుడ్లను తమ నోటిలో ఉంచుకుని చేపలుగా మార్చే వరకు పొదిగుతాయి.

అవి ఇలా ఎందుకు చేస్తాయనేదానిపై ఇప్పటివరకూ ఎటువంటి సమాచారం లేదు.ముఖ్యంగా చేపలు నీటిలో వాటి గుడ్లు లేదా పిల్లలను రక్షించడం కొంచెం కష్టం.

చార్లెస్ డార్విన్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు ఉత్తర ఆస్ట్రేలియాలో కనిపించే రెండు చేపలలో మౌత్ బ్రీడింగ్ ప్రక్రియను గుర్తించారు.ఈ రెండు గుడ్డు-గార్డింగ్ చేపలు మగ నియోరియస్ గ్రేఫీ, గ్లోసామియా ఆప్రియన్.

ఈ పరిశోధన ఫలితాలు బయాలజీ లెటర్స్‌లో ప్రచురితమయ్యాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube