Beetroot Peel : ప‌నికిరావ‌ని బీట్ రూట్ తొక్క‌ల‌ను పారేస్తున్నారా.. అయితే పెద్ద త‌ప్పే చేస్తున్నారు!

బీట్ రూట్( Beetroot ). మన ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే కూరగాయల్లో ఒకటి.

బీట్ రూట్ ను కొందరు డైరెక్ట్‌ గా తింటూ ఉంటారు.అలాగే జ్యూస్, సలాడ్ మరియు కూరగా తయారు చేసుకుని కూడా తీసుకుంటారు.

ఎలా తిన్నా బీట్ రూట్ మనకు అనేక పోషకాలను చేకూరుస్తుంది.ఎన్నో జబ్బుల నుంచి రక్షిస్తుంది.

అయితే అందరూ చేసే కామన్ తప్పు ఏంటంటే బీట్ రూట్ కు ఉన్న తొక్కను చెక్కేసి పారేయడం.బీట్ రూట్ తొక్కలు( Beetroot Peel ) ఎందుకు పనికిరావ‌ని భావిస్తుంటారు.

Advertisement

అందుకే వాటిని డస్ట్ బిన్ లోకి తోసేస్తుంటారు.కానీ నిజం ఏంటంటే బీట్ రూట్ మాత్రమే కాదు బీట్ రూట్ తొక్కలు కూడా మనకి ఉపయోగపడతాయి.

ముఖ్యంగా చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి బీట్ రూట్ తొక్కలు అద్భుతంగా హెల్ప్ చేస్తాయి.ఈ నేపథ్యంలోనే బీట్ రూట్ తొక్కల‌ను చర్మానికి ఎలా ఉపయోగించాలి.? అసలు వాటి వల్ల ఎలాంటి లాభాలు చేకూరుతాయి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో రెండు గ్లాసుల వాట‌ర్ మ‌రియు బీట్ రూట్ తొక్కలు వేసి బాగా వాష్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కడిగిన బీట్ రూట్ తొక్కలు మరియు కొద్దిగా రోజ్‌ వాటర్( Rose Water ) వేసుకుని మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్( Aloevera Gel ), వన్ టేబుల్ స్పూన్ హనీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకొని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చర్మాన్ని సున్నితంగా రబ్ చేసుకుంటూ వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.

ఆక‌లిగా లేదని భోజ‌నం మానేస్తున్నారా.. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఖాయం..!
'హెలికాప్టర్ ' కోసం ఇంత పంచాయతీ జరుగుతోందా ? 

ఈ సింపిల్ రెమెడీ వ‌ల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి.బీట్‌రూట్ పీల్ లో బీటాలైన్‌లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ మరియు విట‌మిన్ సి ఉంటాయి.ఇవి రక్త ప్రసరణను ప్రోత్సహించడంలో సహాయపడతాయి.

Advertisement

మీ ముఖానికి సహజమైన కాంతిని అందిస్తాయి.అలాగే ఈ బీట్ రూట్ పీల్ మాస్క్ ను త‌ర‌చూ వేసుకోవ‌డం వ‌ల్ల ముఖంపై మొటిమ‌లు, వాటి తాలూకు మ‌చ్చ‌లు మాయం అవుతాయి.

కొల్లాజెన్ ఉత్పత్తి( Collagen ) పెరుగుతుంది.ముడ‌త‌లు, చ‌ర్మం సాగ‌డం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

మీ స్కిన్ సూప‌ర్ షైనీ( Skin )గా సైతం మెరుస్తుంది.

తాజా వార్తలు