నాని బాటలో దూసుకుపోతున్న సూర్య

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆకాశమే నీ హద్దురా’ ఇప్పటికే రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో మరోసారి అదిరిపోయే సక్సెస్ అందుకునేందుకు సూర్య రెడీ అవుతున్నాడు.

గతకొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న సూర్య, ఈ సినిమాతో సక్సె్స్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు.అయితే ఈ సినిమాను తొలుత వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.

కానీ కరోనా వైరస్ కారణంగా సినిమా థియేటర్లు మూతపడటంతో ఈ సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేకపోయారు.ఇక థియేటర్లు తెరుచుకున్నాక ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.

కానీ ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేకపోవడంతో ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనే సందేహం అందరిలో నెలకొంది.అయితే సూర్య అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ, ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యాడు.

Advertisement

అక్టోబర్ 30న ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేస్తున్నట్లు సూర్య ప్రకటించాడు.అయితే టాలీవుడ్‌లోనూ నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ‘వి’ని కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు నాని బాటలో సూర్య కూడా వెళ్తున్నాడని, ‘వి’ చిత్రంతో పాటు సూర్య నటిస్తున్న చిత్రం కూడా మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంటుందని ప్రేక్షకులు అంటున్నారు.మరి ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు