'సూర్య42' కోసం గట్టి ప్లానింగ్.. ప్రమోషన్స్ కోసం ఒక్కో భాషలో ఒక్కో సూపర్ స్టార్!

తమిళ్ లో కూడా ఈ మధ్య అడపదడపా భారీ ప్రాజెక్టులు తెరకెక్కుతున్నాయి.మరి భారీ ప్రాజెక్ట్ లలో సూర్య ( Suriya ) నటిస్తున్న 42వ ( Suriya 42 ) సినిమా ఒకటి.

 Suriya 42 Movie Latest Update, Suriya 42, Suriya, Director Siruthai Siva, Disha-TeluguStop.com

ఇది కోలీవుడ్ ( Kollywood ) ఇండస్ట్రీలోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.డైరెక్టర్ శివ ( director Siruthai Siva ) దర్శకత్వంలో ఈ సినిమా గ్రాండ్ గా తెరకెక్కుతుంది.

సూర్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

కోలీవుడ్ ఇండస్ట్రీ నుండి చాలా కాలం తర్వాత ఒక పర్ఫెక్ట్ పాన్ ఇండియన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది అని తమిళ్ ప్రజలు చెప్పుకుంటున్నారు.ఇక తాజాగా ఈ భారీ ప్రాజెక్ట్ పై సినీ వర్గాల నుండి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వచ్చింది.ఈ సినిమా నుండి తాజాగా వచ్చిన క్రేజీ అప్డేట్ ఏంటంటే.

ఈ సినిమా కోసం మేకర్స్ స్పెషల్ ప్లానింగ్ చేస్తున్నారట.

అది ఏంటంటే ఈ సినిమా దడపా 10 భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్టు కోలీవుడ్ మీడియా చెబుతుంది.మరి ఈ సినిమా అన్ని భాషల్లో సాలిడ్ ప్రమోషన్స్ కోసం మేకర్స్ అదిరిపోయే ప్లాన్స్ చేస్తున్నారట.ప్రతీ భాషలో ఆ ఇండస్ట్రీకి చెందిన బిగ్ స్టార్స్ తో ఈ సినిమా ప్రమోషన్స్ చేయించాలని ప్లాన్ చేస్తున్నారట.

ఇక తమిళ్ లో అయితే ఈ సినిమా కోసం ఎవ్వరూ ఊహించని గెస్ట్ ను తీసుకు రాబోతున్నారట.

మొత్తానికి మేకర్స్ చేస్తున్న గట్టి ప్లానింగ్ ఇప్పుడు చర్చకు దారి తీస్తుంది.ఇదిలా ఉండగా ప్రెజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమాలో సూర్యకు జోడీగా దిశా పటానీ ( Disha Patani ) హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ ( Devi Sri Prasad ) సంగీతం అందిస్తున్నారు.అలాగే స్టూడియో గ్రీన్ ( Studio Green ) వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మరి ఈ సినిమాతో కోలీవుడ్ కూడా భారీ కలెక్షన్ల సినిమాల లిస్టులో చేరిపోతుందో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube