‘సూర్య42’ కోసం గట్టి ప్లానింగ్.. ప్రమోషన్స్ కోసం ఒక్కో భాషలో ఒక్కో సూపర్ స్టార్!

తమిళ్ లో కూడా ఈ మధ్య అడపదడపా భారీ ప్రాజెక్టులు తెరకెక్కుతున్నాయి.మరి భారీ ప్రాజెక్ట్ లలో సూర్య ( Suriya ) నటిస్తున్న 42వ ( Suriya 42 ) సినిమా ఒకటి.

ఇది కోలీవుడ్ ( Kollywood ) ఇండస్ట్రీలోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.డైరెక్టర్ శివ ( Director Siruthai Siva ) దర్శకత్వంలో ఈ సినిమా గ్రాండ్ గా తెరకెక్కుతుంది.

సూర్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

"""/" / కోలీవుడ్ ఇండస్ట్రీ నుండి చాలా కాలం తర్వాత ఒక పర్ఫెక్ట్ పాన్ ఇండియన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది అని తమిళ్ ప్రజలు చెప్పుకుంటున్నారు.

ఇక తాజాగా ఈ భారీ ప్రాజెక్ట్ పై సినీ వర్గాల నుండి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వచ్చింది.

ఈ సినిమా నుండి తాజాగా వచ్చిన క్రేజీ అప్డేట్ ఏంటంటే.ఈ సినిమా కోసం మేకర్స్ స్పెషల్ ప్లానింగ్ చేస్తున్నారట.

"""/" / అది ఏంటంటే ఈ సినిమా దడపా 10 భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్టు కోలీవుడ్ మీడియా చెబుతుంది.

మరి ఈ సినిమా అన్ని భాషల్లో సాలిడ్ ప్రమోషన్స్ కోసం మేకర్స్ అదిరిపోయే ప్లాన్స్ చేస్తున్నారట.

ప్రతీ భాషలో ఆ ఇండస్ట్రీకి చెందిన బిగ్ స్టార్స్ తో ఈ సినిమా ప్రమోషన్స్ చేయించాలని ప్లాన్ చేస్తున్నారట.

ఇక తమిళ్ లో అయితే ఈ సినిమా కోసం ఎవ్వరూ ఊహించని గెస్ట్ ను తీసుకు రాబోతున్నారట.

"""/" / మొత్తానికి మేకర్స్ చేస్తున్న గట్టి ప్లానింగ్ ఇప్పుడు చర్చకు దారి తీస్తుంది.

ఇదిలా ఉండగా ప్రెజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమాలో సూర్యకు జోడీగా దిశా పటానీ ( Disha Patani ) హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ ( Devi Sri Prasad ) సంగీతం అందిస్తున్నారు.

అలాగే స్టూడియో గ్రీన్ ( Studio Green ) వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మరి ఈ సినిమాతో కోలీవుడ్ కూడా భారీ కలెక్షన్ల సినిమాల లిస్టులో చేరిపోతుందో లేదో చూడాలి.

సొంతూరు కోసం మంచి మనస్సు చాటుకున్న చంద్రబోస్.. చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే!