Keerthy Suresh: కీర్తి సురేష్‌ లవ్‌ ఎఫైర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కీర్తి తండ్రి.. ఆ అబ్బాయి తెలుసంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్( Keerthy Suresh ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించిన వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

 Suresh Comment On Daughter Keerthy Suresh Love-TeluguStop.com

ఇటీవల కీర్తి సురేష్ ఒక వ్యక్తితో దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఇక అప్పటి ఆమె ప్రేమలో పడింది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

కానీ సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల్లో నిజం లేదు అని కీర్తి సురేష్ తెలిపిన విషయం తెలిసిందే.సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలన్నీ కూడా ఒట్టి పుకార్లే అని తేల్చి చెప్పేసింది.

Telugu Dasara, Farhaan, Keerthy Suresh, Keerthysuresh, Love Matter, Suresh, Toll

ఇది ఇలా ఉంటే ఈ వార్తలపై తాజాగా, కీర్తి సురేష్‌ తండ్రి సురేష్‌( Suresh ) కూడా స్పందించారు.ఈ మేరకు కేరళ బీజీపీ నాయకురాలు శోభ సురేంద్రన్‌ ఖాతాలో ఒక వీడియోను విడుదల చేశారు.ఆ వీడియో లో ఈ విధంగా చెప్పుకొచ్చారు.నా కూతురు కీర్తి ఒక అబ్బాయితో లవ్‌లో ఉందని.త్వరలో అతడ్ని పెళ్లి చేసుకోబోతోందని మీడియాలో వార్తలు వచ్చాయి.ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు.

అవన్నీ ఫేక్‌ న్యూస్‌.

Telugu Dasara, Farhaan, Keerthy Suresh, Keerthysuresh, Love Matter, Suresh, Toll

నాకు ఆ అబ్బాయి తెలుసు.అతడి పేరు ఫర్హాన్‌.( Farhaan ) అతడు మా కుటుంబ స్నేహితుడు.

ఫర్హాన్‌ పుట్టిన రోజున కీర్తి కొన్ని ఫొటోలను షేర్‌ చేసింది.వాటిని చూసి మీడియా తప్పుడు వార్తలు రాసింది.

కీర్తి పెళ్లి కుదిరితే మీడియాకు, ప్రజలకు ముందే చెప్తాము.తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దు.

అలాంటి వార్తల కారణంగా మా కుటుంబంలో మనఃశాంతి కరువైంది అంటూ అసహనం వ్యక్తం చేశారు.ఇకపోతే కీర్తి సురేష్ సినిమాల విషయానికి వస్తే ఇటీవలే దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది కీర్తి సురేష్.

ఈ సినిమాలో నాని హీరోగా నటించిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube