ఏజెంట్( agent ) మూవీ థియేటర్లలో రిలీజ్ కావడానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది.45 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కాల్సిన ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 100 కోట్ల రూపాయలకు చేరింది.
స్టార్ హీరోల సినిమాలను మించిన బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఆ రేంజ్ లో కలెక్షన్లను ఈ సినిమా సొంతం చేసుకుంటుందో లేదో చూడాల్సి ఉంది అయితే ఏజెంట్ సినిమాకు సురేందర్ రెడ్డి( Surender Reddy ) దర్శకుడు అనే సంగతి తెలిసిందే.
ఈ మధ్య కాలంలో సురేందర్ రెడ్డి సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తున్నా ఆ సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలుస్తున్నాయి.ఏజెంట్ సినిమా అఖిల్( Akhil ), సురేందర్ రెడ్డిలకు టెస్టింగ్ మూవీ అని ఈ సినిమా సక్సెస్ సాధిస్తే మాత్రమే వీళ్లిద్దరి కెరీర్ పుంజుకుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఏజెంట్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తే మాత్రమే ఈ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్లు వస్తాయి.
అక్కినేని ఫ్యాన్స్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు.నిర్మాత సైతం ఈ సినిమాను ఒకింత నష్టానికే విడుదల చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్లు సైతం ఆలస్యం అవుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
సురేందర్ రెడ్డికి కొత్త ఛాన్స్ లు రావాలంటే ఈ సినిమాతో భారీ సక్సెస్ సాధించాల్సి ఉంది.వక్కంతం వంశీ( Vakkantam Vamsi ) ఈ సినిమాకు కథ అందించారు.
సురేందర్ రెడ్డి ఈ సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తారో లేక టాలీవుడ్ ప్రేక్షకులను నిరాశకు గురి చేస్తారో చూడాల్సి ఉంది.ఏజెంట్ సినిమాకు బుకింగ్స్ బాగానే ఉన్నా ఆక్యుపెన్సీ ఆశించిన రేంజ్ లో లేదు.
సురేందర్ రెడ్డికి ఈ సినిమాతో ఎలాంటి ఫలితం దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.ఏజెంట్ సినిమా చాలామంది తలరాతలను డిసైడ్ చేయనుందని తెలుస్తోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy