తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సురేఖవాణి (Surekha Vani) ప్రస్తుతం కాస్త సినిమాలను తగ్గించిందని చెప్పాలి.ఒకప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను సందడి చేసిన ఈమె ఈ మధ్యకాలంలో సినిమాలకు దూరమై సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యారు.
ఇలా సోషల్ మీడియా వేదికగా తన కుమార్తె సుప్రీత(Supritha)తో కలిసి సురేఖవాణి చేసే హంగామా మామూలుగా ఉండడం లేదు.సోషల్ మీడియాలో వీరు చేసే రచ్చకు ఏకంగా హీరోయిన్ లకు మించి ఫాన్ ఫాలోయింగ్ ఉంది.
నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్టులు చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు.
సురేఖ వాణి తన భర్తను తలుచుకుంటూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.సురేఖ వాణి భర్త సురేష్ తేజ(Suresh Teja) గత కొద్ది సంవత్సరాలు క్రితం మరణించిన విషయం మనకు తెలిసిందే.అయితే తన భర్త మరణంతో ఎంతో కృంగిపోయిన సురేఖ వాణి ఆ బాధ నుంచి బయటపడిన తర్వాత తన కూతురితో కలిసి ఇలా సరదాగా ఎంజాయ్ చేస్తూ గడుపుతున్నారు.
తాజాగా సురేఖ వాణి తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంది.తన కుమార్తె సుప్రీత తన తల్లికి పుట్టినరోజు(Birthday) వేడుకలను నిర్వహించారు.
అయితే ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను సురేఖవాణి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.తన భర్త సురేష్ తేజ ఫోటో పక్కన పెట్టుకొని ఈమె కట్ చేశారు.అయితే ఈ ఫోటోలను వీడియోని షేర్ చేసిన సురేఖ వాణి… తన కళ్ళల్లో ఆనందం ఉన్న పక్కన నువ్వు లేవని బాధ చాలా ఎక్కువగా ఉంది.నువ్వు నా పక్కన లేకపోయినా నీ ప్రేమ ఆశీర్వాదాలు ఎల్లప్పుడు నాతో ఉంటాయని నాకు తెలుసు.
నువ్వు నా ప్రతి పుట్టినరోజుకు చేసే హంగామా ఇప్పటికీ గుర్తుంది.నిన్ను చాలా మిస్ అవుతున్నా లవ్ యు ఫర్ ఎవర్ అంటే ఈమె ఎమోషనల్ పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.