తెలంగాణలో ప్రాంతీయ పార్టీగా ఉన్న టిఆర్ఎస్( TRS ) ను బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీగా మార్చారు ఆ పార్టీ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్.తెలంగాణతో పాటు దేశ రాజకీయాల్లో బీ ఆర్ ఎస్ ను కీలకం చేసి , కేంద్రంలో వివిధ ప్రాంతీయ పార్టీల మద్దతుతో అధికారంలోకి రావాలనే ఆలోచనతో టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ అనే జాతీయ పార్టీగా మార్చారు కెసిఆర్.
తెలంగాణలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్( BRS ) పేరుతోనే ఎన్నికలకు వెళ్లి మూడోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు.బిజెపి కాంగ్రెస్( Congress ) ల నుంచి గట్టి పోటీ ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు మరో గండం వచ్చి పడింది.
తెలంగాణలో టిఆర్ఎస్ పేరుతో కొత్త రాజకీయ పార్టీ రిజిస్టర్ కావడం, దీనికి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలపడంతో, బీఆర్ఎస్ కు గుబులు పట్టుకుంది.
టిఆర్ఎస్ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేరింది.కెసిఆర్ నేతృత్వంలోని టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడంతో కేంద్ర ఎన్నికల సంఘం టిఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీకి అనుమతించినట్లు తెలుస్తోంది.సిద్దిపేట జిల్లా పొన్నాల గ్రామానికి చెందిన తుపాకుల బాల రంగా కొత్త టిఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు.
ఉపాధ్యక్షుడిగా తుపాకుల మురళి ప్రధాన కార్యదర్శి,గా, నల్లా శ్రీకాంత్, కోసాధికారిగా సదుపల్లి రాజు( Nalla Srikanth, Sadupalli raju ) పేర్లు ఎన్నికల సంఘానికి పంపిన దరఖాస్తులో పేర్కొన్నారు .అయితే ఈ టీఆర్ఎస్ ను తెలంగాణ రాజ్యసమితి పేరుతో ఎన్నికల సంఘానికి వీరు దరఖాస్తు చేశారు.ఇక టిఆర్ఎస్ పేరుతోనే వీరు రాజకీయ కార్యకలాపాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.ఇప్పటికే ఈ పార్టీ పేరుపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో తెలియజేయాలని కేంద్ర ఎన్నికల సంఘం కోరింది.
అలాగే అనేక భాషల్లో వివిధ పత్రికల్లో కూడా ప్రకటన ఇచ్చింది.దీనిపై అభ్యంతరాలు ఉంటే మే 27వ తేదీ వరకు కేంద్ర ఎన్నికల సంఘానికి తమ అభ్యంతరాలను చెప్పుకునే అవకాశం కల్పించారు.అయితే ఈ పార్టీ పేరుపై బీఆర్ఎస్ అభ్యంతరం తెలిపే అవకాశం కనిపిస్తోంది .ఎందుకంటే టిఆర్ఎస్ పేరుతో కొత్త రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీకి దిగితే ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందని, కచ్చితంగా తమ పార్టీకి పడే ఓట్లలో చీలిక వస్తుందని టిఆర్ఎస్ ఆందోళన చెందుతోంది.ఇప్పుడు ఈ కొత్త రాజకీయ పార్టీ అంశంపై తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశం గా మారింది.