మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి ( YS Vivekananda Reddy )హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శివ శంకర్ రెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది.
అయితే వివేకానంద రెడ్డి హత్య కేసులో శివశంకర్ రెడ్డికి ( Sivashankar Reddy )తెలంగాణ హైకోర్టు మార్చి 11వ తేదీన బెయిల్ మంజూరు చేసింది.ఈ క్రమంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు.ఈ నేపథ్యంలో సునీతా రెడ్డి పిటిషన్ పై జస్టిస్ సంజీవ్ ఖన్నా( Justice Sanjeev Khanna ) నేతృత్వంలోని ధర్మాసంన విచారణ జరిపింది.
ఇందులో భాగంగా శివశంకర్ రెడ్డితో పాటు ప్రతివాదులు అందరికీ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణను జులై 22వ తేదీకి వాయిదా వేసింది.