బాబా రామ్‎దేవ్‎పై మరోసారి సుప్రీంకోర్టు ఆగ్రహం

పతంజలి సంస్థ వ్యవస్థాపకులు బాబా రామ్‎దేవ్‎ ( Baba Ramdev )తో పాటు సంస్థ ఎండీ బాలకృష్ణపై ( MD Balakrishna )సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ప్రజలను తప్పుదొవ పట్టించే విధంగా పతంజలి ఉత్పత్తుల ప్రకటనలు ఉన్నాయన్న కేసుపై అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది.

 Supreme Court Once Again Angered Baba Ramdev ,  Baba Ramdev ,supreme Court , Pat-TeluguStop.com

కోర్టు ఎదుట హాజరైన బాబా రామ్‎దేవ్‎, ఎండీ బాలకృష్ణ ధర్మాసనానికి క్షమాపణలు చెప్పారు.ఈ క్రమంలో బాబా రామ్‎దేవ్‎, బాలకృష్ణల వివరణపై సుప్రీం అసంతృప్తి వ్యక్తం చేసింది.

బహిరంగ క్షమాపణలు చెప్తూ ప్రకటనలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.భవిష్యత్ లో ఇటువంటి చర్యలు పునరావృతం కావొద్దని సూచించింది.

నయం చేయలేని వ్యాధులపై ప్రకటనలు ఇవ్వకూడదన్న విషయం తెలియదా అని ప్రశ్నించింది.గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేశారంటూ మండిపడింది.

అనంతరం తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube