రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్ళ బాధితుల పక్షాన కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు నేరెళ్ళ ఘటన బాధితుడు కోల హరీష్ వెల్లడించారు.ప్రభుత్వాలు మారినా తమకు న్యాయం జరగడం లేదంటూ ఆవేదనా వ్యక్తం చేసిన హరీష్.పార్లమెంటు సాక్షిగా తమకు జరిగిన అన్యాయాన్ని గొంతెత్తి చెప్పడానికి ఎన్నికల బరిలో నిలిచినట్లు వెల్లడించారు.8 ఏండ్లుగా పోరాటం చేసినా తమకు న్యాయం జరలేదని.తమపై తార్డ్ డిగ్రీ ప్రయోగించినా అధికారులకు మాత్రం ప్రమోషన్లు వచ్చాయంటు మండిపడ్డ బాధితులు.తమకు న్యాయం జరగాలని ప్రజల్లోకి వెళ్లి అడుగుతామని.అందుకే కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలుస్తునట్లు పేర్కొన్న నేరేల్ల బాధితుడు హరీష్.
Latest Rajanna Sircilla News