మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.ఈ విచారణలో భాగంగా ఎర్ర గంగిరెడ్డికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టును కోరింది.సాక్షులను రక్షించుకోవాలంటూ బెయిల్ రద్దు చేయాలని వాదనలు వినిపించింది.
ఈ క్రమంలో సీబీఐ వాదనను పరిగణనలోకి తీసుకున్న సుప్రీం ధర్మాసనం ఎర్రగంగిరెడ్డికి నోటీసులు జారీ చేసింది.దీనిపై నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది.
అనంతరం తదుపరి విచారణను నవంబర్ 14కు వాయిదా వేసింది.