అమరావతి కేసులపై సుప్రీంకోర్టులో విచారణ

అమరావతి కేసులపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.అమరావతే రాజధాని అంటూ గతంలో ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది.

ఈ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరగనుంది.

ఐటెమ్ నంబర్ 65 గా జస్టిస్ ఖన్నా, జస్టిస్ దత్త ధర్మాసనం ముందు కేసు లిస్ట్ అయింది.ఈ నేపథ్యంలో అమరావతి రాజధాని వ్యవహారంలో సుప్రీం ఏం తీర్పు ఇవ్వనుందనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఈ హోమ్ మేడ్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ బ్రైట్ అవ్వడం ఖాయం!
Advertisement

తాజా వార్తలు