సుప్రీంకోర్టులో గాలి జనార్దన్ రెడ్డికి స్వల్ప ఊరట..!!

అక్రమ మైనింగ్ కేసులో కొన్ని నెలల పాటు జైలులో ఉన్న మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కి సుప్రీంకోర్టులో తాజాగా ఊరట లభించింది.

గాలి జనార్దన్ రెడ్డికి బళ్లారి వెళ్లడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడం జరిగింది.

బళ్లారిలో ఏ ప్రాంతాలకు వెళుతున్నారు.? ఎక్కడ ఎన్నిరోజులు ఉంటారు.? అనే వివరాలు ముందుగా.స్థానిక ఎస్పీకి తెలియజేయాలని సుప్రీంకోర్టు గాలి జనార్దన్ రెడ్డికి అనుమతులు ఇస్తూ సూచించింది.

ఈ క్రమంలో బళ్లారి, కడప, అనంతపురం లలో గాలి జనార్దన్ రెడ్డి పర్యటనకు సంబంధించి తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని సిబిఐ పేర్కొంది.ఇదిలా ఉంటే తన బెయిల్ షరతులు మార్పులు చేయాలని బళ్ళారిలో 8 వారాలు ఉండేలా అనుమతి ఇవ్వాలని సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది.ఈ పిటిషన్ పై సుదీర్ఘ విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ధర్మాసనం.

గాలి జనార్దన్ రెడ్డి బళ్లారి అనంతపురం కడప కలలో పర్యటించడానికి ఎటువంటి అభ్యంతరాలు లేవని.కానీ ముందుగా ఏఏ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు ఉంటున్నారో స్థానిక ఎస్పీకి తెలియజేయాలని స్పష్టం చేసింది.

Advertisement
పర్షియన్ కార్పెట్ లాంటి కేక్ ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే ఫిదా..

తాజా వార్తలు