కృష్ణా జలాల వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది.ఈ మేరకు తదుపరి విచారణను న్యాయస్థానం జనవరి 12కు వాయిదా వేసింది.
కృష్ణా ట్రైబ్యునల్ కు నూతన విధివిధానాలు ఇవ్వడాన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.ఈ పిటిషన్ పై ధర్మాసనం విచారణ చేపట్టగా కౌంటర్ దాఖలు చేసేందుకు కేంద్ర జలశక్తి శాఖ సమయం కావాలని కోరింది.
ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాలను పంపిణీ చేయాలని ఇటీవలే కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.