రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జల వివాదం పై స్పందించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్..!!

గత కొద్ది నెలల నుండి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాలకు సంబంధించి తీవ్ర వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.

ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రప్రభుత్వాలు నువ్వా నేనా అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాయి.

ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా చాలా మొండిగా వ్యవహరిస్తూ.ఎవరు వెనక్కి తగ్గడం లేదు.

ఇటువంటి తరుణంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తాజాగా స్పందించారు.

తాను రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తిని అని, జల వివాదానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మధ్యవర్తిత్వం ద్వారా కూర్చుని మాట్లాడుకోవాలని కోరారు.మధ్యవర్తిత్వానికి సంబంధించి పూర్తిగా సహకరిస్తామని ఎన్.వి.రమణ స్పష్టం చేశారు.జలజగడం కి  సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ విచారణకు వచ్చిన నేపథ్యంలో ఎన్.వి.రమణ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గేజిట్ జారీ చేయడం జరిగిందని.

Advertisement

రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నీటి నీ నష్ట పోకూడదు అని .సామరస్య వాతావరణంలో వివాదం పరిష్కరించుకోవాలని సూచించారు.

ఇంతకీ.. కుప్పంలో బాబు గారి పరిస్థితేంటి ? 
Advertisement

తాజా వార్తలు