సురేఖావాణి కూతురు సుప్రీత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.నెటిజన్ల నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు సుప్రీత తనదైన శైలిలో సమాధానాలను ఇస్తుంటారు.
కొన్నిసార్లు సుప్రీత ట్రోలింగ్ కు గురైనా ఆమెను అభిమానించే అభిమానుల సంఖ్య ఎక్కువగానే ఉందనే సంగతి తెలిసిందే.భవిష్యత్తులో సుప్రీత స్టార్ హీరోయిన్ కావడం ఖాయమని ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
తాజాగా ఒక నెటిజన్ ప్రేమలో పడితే ఆకలి నిద్ర రావు అంటూ పోస్ట్ పెట్టగా సుప్రీత భయ్యా మనకు ఎందుకు ఈ లవ్వూ జివ్వూ అంటూ చెప్పుకొచ్చారు.ఆ తర్వాత నేను బాగా తింటాను పడుకుంటాను అంటూ సుప్రీత తనదైన శైలిలో జవాబిచ్చారు.
సుప్రీత చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం తాను ప్రేమలో లేనని సుప్రీత తన కామెంట్ల ద్వారా పరోక్షంగా వెల్లడించారు.
మరోవైపు సుప్రీతకు రోజురోజుకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. సురేఖావాణి ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.
అయితే గతంతో పోల్చి చూస్తే సురేఖావాణికి సినిమా ఆఫర్లు మాత్రం తగ్గడం గమనార్హం.సురేఖావాణి మళ్లీ వరుస ప్రాజెక్ట్ లతో బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
సురేఖావాణి, సుప్రీత కలిసి నటిస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సుప్రీత సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకోవడంతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం ద్వారా అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు.అయితే తెలుగమ్మాయిలు టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ కావడం తేలికైన విషయం కాదు.సుప్రీత ఈ సెంటిమెంట్ ను అధిగమిస్తారో లేదో చూడాల్సి ఉంది.
సురేఖావాణి కూతురు సుప్రీత స్టార్ హీరోల ప్రాజెక్ట్ లపై దృష్టి పెడితే ఆమె కెరీర్ బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.







